అమరావతి : జూనియర్ విషయంలో టీడీపీ రూటు మార్చిందా ?

frame అమరావతి : జూనియర్ విషయంలో టీడీపీ రూటు మార్చిందా ?

Vijaya


క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జూనియర్ ఎన్టీయార్ నటించిన సినిమా రిలీజ్ సందర్భంగా చాలా థియేటర్ల దగ్గర అభిమానులు పెద్దఎత్తున హాంగామా చేశారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు రచ్చ చేయటం చాలా సహజమే. కానీ ఇక్కడ రచ్చ చేసిన వారిలో అభిమానులకు తోడు టీడీపీ శ్రేణులు కూడా ఉన్నాయి.



ఈ విషయంలోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జూనియర్ విషయంలో టీడీపీ తన రూటు మార్చుకున్నదా ? అనే సందేహాలు పెరిగిపోతోంది. ఎందుకంటే పార్టీకి జూనియర్ కు ఏమీ సంబంధం లేదన్నట్లుగా చంద్రబాబునాయుడు, లోకేష్ వ్యవహరిస్తున్నారు. తాము పాల్గొన్న కార్యక్రమాల్లో జూనియర్ కు సంబంధించిన నినాదాలు వినబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



అయినా అక్కడక్కడ అభిమానులు జూనియర్ కి జిందాబాదులు కొటినా, పార్టీపగ్గాలు జూనియర్ కు అప్పగించాలని డిమాండ్లు వినిపించినా విననట్లే తండ్రి, కొడుకులు వదిలేస్తున్నారు.  అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే 2024 ఎన్నికలు చంద్రబాబు జీవన్మరణసమస్య. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఏపీలో పార్టీకి తెలంగాణా గతే పడుతుంది. చంద్రబాబు నాయకత్వం మీద చాలామంది నేతల్లో నమ్మకంలేదు. అలాగే లోకేష్ నాయకత్వానికి పనికేరాడని చాలామంది తేల్చేశారు. ఏతా వాతా చూస్తే చివరకు జూనియరే పార్టీకి దిక్కుగా మారేట్లున్నాడు. అందుకనే ఇప్పటినుండే ప్లాన్ మార్చుకున్నట్లు కనబడుతోంది.



ఈ పరిస్ధితుల్లో క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటి ఉన్న జూనియర్ వాడుకోవటం మినహా చంద్రబాబుకు దారిలేదు. పైగా అవసరానికి వాడుకుని తర్వాత వదిలేయటంలో ట్రాక్ రికార్డు అందరికీ తెలిసిందే. ఇందులో భగాంగానే జూనియర్ విషయంలో రూటు మార్చుకున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. లేకపోతే అభిమానులతో పాటు టీడీపీ నేతల థియేటర్ల దగ్గర హాంగామా చేయాల్సిన అవసరమే లేదు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని థియేటర్ల దగ్గర టీడీపీ నేతల హడావుడి కూడా బాగా కనబడింది. సరిగ్గా సీనియర్ ఎన్టీయార్ శంతజయంతికి ముందు, పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముందు ధియేటర్ల దగ్గర మొదలైన పరిణామాలు ఆసక్తిగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: