పెరిగిన ధరలపై ఫైర్ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత ?

VAMSI
" data-original-embed="" >

ప్రస్తుతం దేశంలో కొన్ని వస్తువులపై పెరుగుతున్న ధరల గురించి తెలిసిందే. అయితే ఈ ధరల పెరుగుదలకు కారణాలు ఏమైనా అవ్వొచ్చు.. కానీ అల్టిమేట్ గా ఇది సామాన్య ప్రజలను తీవ్రంగా బాధిస్తోంది అని చెప్పాలి. రోజూ వాడుకునే వస్తువులు ధరలు పెరిగి పోతే... ఇక వారి పరిస్థితిని బాధను వర్ణించడానికి మాటలు చాలవు. అయితే ఇదే విషయంపై కాసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.  ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ కేవలం ఏడు రోజుల సమయంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రూ. 3.20 పెరిగిందని చెప్పారు. అయితే దాదాపుగా అయిదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి పెట్రోల్ మరియు డీజిల్ ధరలతో మార్పులు రాలేదు. ఇందులో పాలక పార్టీ బీజేపీ స్వార్థం ఎంతైనా ఉంది. అయితే ఎన్నికల ఫలితాలు ముగిసిన పది రోజులకే ఇంత మొత్తంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచి ప్రజల నెత్తిన పిడుగు వేశారు. ఇక కేవలం పెట్రోల్ డీజిల్ మాత్రమే కాకుండా... వంట గ్యాస్ సిలిండర్ పై రూ. 50 పెంచి బీజేపీ స్వభావాన్ని చూపించారు. ఇక మెడిసిన్స్ పై కూడా 10 శాతం పెంచి ప్రజలపై తమకున్న ఆగ్రహాన్ని చూపించారు అని చెప్పాలి.

మల్లికార్జున్ ఖర్గే ఇలా ఈ స్థాయిలో ధరలు పెరగడం మంచిది కాదు అన్నారు. ఇక ఈ దేశం అభివృద్ధి చెందకపోవడానికి నిరుద్యోగం ప్రధాన కారణం. అయితే ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ సమస్య ఇప్పటికీ తీరలేదు. మరి ఈ నిరుద్యోగ కష్టాలు ఎప్పటికి తీరుతాయో అని తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.  మరి ముందు ముందు ఇంకా ఎన్ని ధరలు భరించలేనంతగా మారుతాయో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: