క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా... "పెట్రో - డీజిల్" ధరలు పెరుగుతున్నాయి ?
తాజాగా లీటర్ పెట్రోల్ ధర పై 30 పైసలు పెరుగగా, డీజల్ ధర లీటర్ పై 35 పైసలు పెరిగింది. ఇటీవల కాలం లో మొత్తం మీద కనుక చూస్తే పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 4 మరియు డీజిల్ రూ. 4.10 వరకు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ... పెట్రోల్ - డీజిల్ ధరలు పెరుగుతూ పోతుండటంతో వాహన దారులు మండి పడుతున్నారు. కాలంతో పరుగులు తీసే క్రమంలో వాహనాలు తప్పని సరిగా మారుతున్న ఈ రోజుల్లో.... అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇలా పెట్రోల్ - డీజల్ ధరలు పెంచేస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు వాహనదారులు. మరి ఇకనైనా పెరోల్ - డీజిల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుందేమో చూడాలి.
చాలా మంది అయితే ఈ పెరుగుతున్న ధరలతో పోటీ పడలేక, వాటిని భరించే స్థోమత లేక కాళీ నడకే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. సింగిల్ గా వాహనాల్లో ప్రయాణించడం కన్నా పబ్లిక్ వాహనాల్లో ప్రయాణించడమే బెటర్ అని అనుకుంటున్నారు. ఇలా అకారణంగా ధరలు ఎంచడం దేనికి సంకేతం అంటూ ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు.