అమరావతి : ఎల్లోమీడియా మైండ్ గేమ్ వర్కవుటవుతుందా ?

Vijaya



ఇపుడిదే ప్రశ్న ఇటు వైసీపీ అటు టీడీపీల్లో చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తేవటంలో చంద్రబాబునాయుడు ఫెయిలైపోయారు. అందుకని ఆ బాధ్యతను ఎల్లోమీడియా భుజనేసుకున్నది. నిజానికి గడచిన మూడేళ్ళుగా జగన్ కు వ్యతిరేకంగా ఒకవైపు చంద్రబాబు మరోవైపు ఎల్లోమీడియా ఏకకాలంలో మైండ్ గేమ్ ఆడాయి. అయితే వీళ్ళ ప్రయత్నాలకు జగన్ ఏమాత్రం లొంగలేదు. దాంతో విసిగిపోయిన చంద్రబాబు మిడిల్ డ్రాప్ అయిపోయారు.



అయితే రాబోయే ఎన్నికల్లో జగన్ ఓడిపోవటం చంద్రబాబుకు ఎంతవసరమో ఎల్లోమీడియాకు అంతకన్నా ఎక్కువ అవసరం. అందుకనే చంద్రబాబు మిడిల్ డ్రాప్ పెట్టేసినా ఎల్లోమీడియా మాత్రం మైండ్ గేమ్ కంటిన్యు చేస్తునే ఉంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పథకాలంతా డొల్లని, ఆర్ధిక అరాచకమని, ఎస్సీలపై అత్యాచారాలని, దాడులని ప్రతిరోజు వార్తలు, కథనాలు రాస్తు జనాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది.



ఇవన్నీ సరిపోదన్నట్లుగా అమరావతి ఇష్యూలో హైకోర్టు తీర్పును హైలైట్ చేస్తోంది. రాజధాని నగరాన్ని నిర్మించాలన్న హైకోర్టు తీర్పును జగన్ లెక్కచేయలేదు. లాజికల్ గా కోర్టు తీర్పు అమలు సాధ్యంకాదని జగన్ అసెబ్లీ సాక్షిగా చెప్పేశారు. దాన్నే ఇపుడు ఎల్లోమీడియా పదే పదే హైలైట్ చేస్తోంది. ఎలాగైనా సరే కోర్టు తీర్పును థిక్కరించిన జగన్ను జనాల ముందు విలన్ గా చూపించాలని ఎల్లోమీడియా తెగ ప్రయత్నిస్తోంది.



అయితే ఎల్లోమీడియా మరచిపోయిన విషయం ఏమిటంటే అమరావతి ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో జగన్ నిర్ణయాన్ని జనాలు స్వాగతిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికే జగన్ కట్టుబడి ఉండటాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ జనాలు సానుకూలంగా ఉన్నారు. కోర్టు తీర్పేరు చూపించి జగన్ యూ టర్న్ తీసుకోలేదన్న విషయాన్ని పై ప్రాంతాల్లోని జనాలు గుర్తించారు. కాబట్టి జగన్ పై ఎల్లోమీడియా మైండ్ గేమ్ ఏ దశలో కూడా వర్కవుటవదని అర్ధమైపోతోంది. మరి మిగిలిన రెండేళ్ళు చంద్రబాబు, ఎల్లోమీడియా ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: