రైతులకు బిగ్ అలెర్ట్... ఈ వివరాలు పూర్తి చేయకుంటే డబ్బులు రావు?
అది ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. అయితే అందుకోసం గాను మార్చ్ 31 లోపు రైతులు e-KYC పూర్తి చేయాల్సి ఉంటుంది, లేదంటే పూర్తి చేయని రైతులు ఈ పథకానికి అనర్హులుగా మారుతారు. అటువంటి వారికి కేంద్రం ఈ పథకం కింద ఎటువంటి సహాయాన్ని అందించదు. అయితే ఎవరైతే ఇందుకు అర్హులో వారి ఈ మార్చ్ 31 లోగా ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని పనులను గురించి తెలుసుకోవడం ముఖ్యం. రైతులకు ఈ పదకాన్ని వినియోగించుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 31లోగా e-KYC వివరాలను రైతులు నమోదు చేయాలి.
ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 10వ విడత రైతుల ఖాతాలలో జనవరి 1, 2022న విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇంకో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఎవరైతే ఇంకా పూర్తి చేసి ఉండరో వారు వెంటనే కంప్లీట్ చేసి సహాయాన్ని అందుకోగలరు. అలా కాకుండా ఈ విషయం గురించి ఇంకెలా ఏమైనా సందేహాలు ఉంటే దగ్గర్లోని సచివాలయానికి వెళ్లి సరైన వివరాలను పొందగలరు.