ఇకపై వాహనాలపై ఆ స్టికర్ లు ఉంటే జరిమానా ?
మంగళవారం నాడు సిటీలోని నారాయణ గూడాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ప్రజలకు ఈ అంశం పై అవగాహన పెంచేలా చేశారు. అంతే కాకుండా స్టిక్కర్లు ఉన్న వాహనాలను నిలిపి వాటిని తొలగించి విషయాన్ని తెలియచేసి ఎవరైనా సరే నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలని తెలియచేశారు. నిబందలను అతిక్రమిస్తే ఎవరైనా సరే చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కార్ ను సైతం ఆపి తనిఖీలు చేసి కార్ కు ఉన్న బ్లాక్ స్క్రీన్ ను తొలగించిన విషయం తెలిసిందే. అదే రోజు మరి కొందరి రాజకీయ నాయకుల కార్ లను సైతం చెక్ చేసి బ్లాక్ స్క్రీన్ లను తొలగించారు.
ఈ మధ్య పోలీసు శాఖ దూకుడు పెంచింది, ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం సైతం పోలీసులకు అండగా నిలబడుతూ , ఆదేశాలను జారి చేస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే ఇక మీదట దొంగ స్టిక్కర్ లతో తిరిగే ఆకతాయిల ఆటలు సాగవని అర్ధమవుతోంది. కాబట్టి ప్రజలందరూ పోలీసు వారు సూచించిన వాటిని గౌరవించి వారికి సహకరించవలెను.