గత రెండు రోజులుగా ఏపిలో విద్యుత్ చార్జీల అంశం పై టెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. తెలంగాణలో రెండు రోజుల క్రితమే... విద్యుత్ చార్జీలను పెంచిన నేపథ్యంలో ఇటు ఎపిలోను పెంచే అవకాశం ఉందని అంతా టెన్షన్ పడ్డారు. కాగా అనుకున్న విధంగానే ఏపి లోను విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. తాజా సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోనూ విద్యుత్ చార్జీలను పెంచినట్లు తెలుస్తోంది. విద్యుత్ చార్జీల పెంపు పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్య ప్రజలపై ఆర్ధిక భారం పడనుంది. పెంచిన విద్యుత్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. విద్యుత్ చార్జీల వివరాలను వెల్లడిస్తూ పెరిగిన విద్యుత్ టారిఫ్ ను విడుదల చేశారు ఎపిఈఆర్సి ఛైర్మన్ .
కరెంట్ చార్జీలు 30 యూనిట్ల వరకు కనుక వచ్చినట్లయితే యూనిట్ కు 45 పైసలు వసూలు చేయడం జరుగుతుంది. అదే విధంగా వాడిన కరెంట్ 31-75 యూనిట్ల మధ్యలో కనుక ఉన్నట్లైతే ఒక యూనిట్ కు 91 పైసలు వరకు ఛార్జ్ చేయబడుతుంది. అలాగే 76-125 యూనిట్ల మద్య కనుక ఉంటే ఒక యూనిట్ కు రూ.1.40 పైసలు పెంచిన ధరల ప్రకారం ఛార్జ్ చేయబడుతుంది అని ఏపి సర్కారు వెల్లడించింది. 400యూనిట్ల పైన యూనిట్ కు రూ.9.75..126 - 225 యూనిట్ల వరకు ఉన్నటువంటి యూనిట్ కు రూ.6.
అదే విధంగా 226-400 యూనిట్ల మద్య వరకు యూనిట్ కి రూ.8.75 ఉన్న చార్జీల.. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్ లను తీసుకొచ్చామని ఏపీఈఆర్సీ చైర్మన్ వెల్లడించారు. 30 యూనిట్ల వరకు ఉన్నటువంటి యూనిట్ కు రూ.1.90. 31-75యూనిట్ల వరకు యూనిట్ కు రూ.3 గా పేర్కొన్నారు. కొత్త ఆర్ధిక సంవత్సరం లో పెంచిన విద్యుత్ ఛార్జీలు సైతం సామాన్య ప్రజలపై భారంగా మారాయి