టీడీపీ నేత అజీజ్: జగన్... "మేక తోలు కప్పుకున్న పులి" ?
అయితే ఇది చూసి ఓర్వలేని టీడీపీ నాయకులు ప్రజల్లోకి వైసీపీ గురించి మరియు ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారాలు చేసేవారని గతంలో అనేక వార్తల మనము తెలుసుకున్నాము. అంతే కాకుండా టీడీపీ నాయకులు కొందరు చెబుతున్న విధంగా జగన్ చెప్పిన హామీలను నెరవేర్చడం లేదని చాలా సార్లు మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నెల్లూరు లోనే మాగుంట లే అవుట్ లో ఉన్న పిచ్చి రెడ్డి కల్యాణ మండపంలో ముస్లిం ల సమరభేరి ముగింపు కార్యక్రమంలో జగన్ పై మాజీ మేయర్ మరియు టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ పలు వ్యాఖ్యలు చేశారు.
ఈయన మాట్లాడుతూ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పేను అధికర్మలోకి వచ్చారు. జగన్ ఒక మేక వన్నిన పులి అని సంచలన కామెంట్ చేశారు. ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న జగన్ కు ప్రజలు త్వరలోనే సరైన సమాధానం చెప్తారని ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.