జైల్లో ఖైదీలకు లోన్స్.. ప్రభుత్వం కీలక నిర్ణయం?
కానీ బ్యాంకులో రుణం పొందడం అంటే మాత్రం అది కుదరని పని అని చెప్పాలి. ఇలాంటి నిబంధనల కారణంగా ఖైదీల కుటుంబాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి వివిధ కేసుల కారణంగా జైలుకు వెళ్లడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పుడు మాత్రం ఖైదీలకి ఆర్థిక భద్రత కల్పించేందుకు లోన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏకంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు తక్కువ వడ్డీ రుణం అందించనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే దేశంలోనే ఖైదీలకు రుణాలు ఇవ్వడానికి నిర్ణయించడం ఇది తొలిసారి అని చెప్పాలి.
పూణె లోని ఎరవాడ జైలులో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సరికొత్త పథకం కింద వ్యక్తిగతంగా 50 వేల వరకు రుణాలు ఖైదీలు తీసుకునే అవకాశం ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంక్ ఈ పథకం కింద ఖైదీలకు 7 శాతం వడ్డీ రేటుతో రుణం అందిస్తుంది అని చెప్పాలి. అయితే జైల్లో ఉన్న ఉన్న ఖైదీలకు రుణ సదుపాయం కల్పించడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. ఇక రోజువారి వేతనాలను శిక్షా కాలం శిక్ష నుంచి సాధ్యమయ్యే ఉపశమనం వయస్సు లాంటి కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని రుణాలు అందించబోతున్నారు. పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న ఒక 1055 మంది ఖైదీలు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు.