కీవ్ : రష్యా సైనికులు పారిపోతున్నారా ?

Vijaya



వినటానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజ్జంగా నిజమట. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధానికి దిగి ఇప్పటికి నెలరోజులు దాటిపోయింది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ నగరాలను ఎంతగా ధ్వంసం చేయాలో రష్యా సైన్యం అంతా చేసేశాయి. రాజధాని కీవ్, ఛైర్న్ హైవ్, ఖైరన్, మేరియాపోల్ లాంటి అనేక నగరాలపై బాంబులు, క్షిపణలుతో దాడులు చేసి చాలావరకు విధ్వంసాన్ని సృష్టించాయి. ఉక్రెయిన్లో ఒకవైపు విధ్వంసం సృష్టిస్తున్న రష్యా సైన్యాలు మరోవైపు పారిపోతున్నాయట.



రష్యా సైన్యం ఉక్రెయిన్ నుండి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే చెర్నోబిల్ నుండి అణుధార్మికత బాగా పెరిగిపోతోందట. ఛెర్నోబిల్ అంటే అణుకేంద్రం అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. 1986లో చెర్నోబిల్ లోని అణుకర్మాగారంలో జరిగిన ఘోర ఘటన తర్వాత ఆ కేంద్రాన్ని రష్యా అంటే పూర్వపు యూఎస్ఎస్ఆర్ మూసేసింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనాలను కూడా దూరంగా తరలించేసింది.



యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమై 15 స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. అలాంటి వాటిల్లో అతిపెద్దది ప్రస్తుత ఉక్రెయిన్. చెర్నోబిల్ అణుకేంద్రం ఉన్నది ఉక్రెయిన్ ప్రాంతంలోనే కాబట్టి ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత చెర్నోబిల్ ఉక్రెయిన్ దేశం వశమైపోయింది. ఎక్కడో అడవుల మధ్య జనావాసాలు లేకుండా ఉష్ణోగ్రతలు పెరగకుండా ఇంతకాలం ఉక్రెయిన్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటోంది.



చెర్నోబిల్ కేంద్రంకు సమీపంలో వేడి లేదా భూప్రకంపనలు సంభవిస్తే కర్మాగారంలోని అణుధార్మికత విడుదలవుతుంది. ఈ విషయం రష్యాకూ బాగా తెలుసు. అయితే ప్రస్తుత యుద్ధం కారణంగా చెర్నోబిల్ చుట్టుపక్కల పెద్దఎత్తున బాంబులు, క్షిపణలు పేలుతున్నాయి. దాంతో భూప్రకంపనలే కాకుండా ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోయాయట. దాంతో అణుకర్మాగారం నుండి అణుధార్మికత బయటకు వచ్చేస్తోంది. దీంతో దీనికి కాపలాగా ఉన్న రష్యా సైనికులందరిపైనా దాని ప్రభావం పడుతోందట. అందుకనే ఆ ప్రాంతంలో ఉన్న రష్యా సైనికులంతా బెలారస్ పారిపోతున్నారు. దీంతో రష్యాకు ఏమి చేయాలో అర్ధంకాక స్వాధీనం చేసుకున్న చెర్నోబిల్ కర్మాగారాన్ని తిరిగి వదిలిపెట్టేసింది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: