కరోనా కొత్త వేరియంట్ "XE ఒమిక్రాన్" లక్షణాలు ఇవే?
ఈ రకమైన కొత్త వేరియంట్ మొదట యూకేలో జనవరి 19న బయటపడిందట. అయితే ఈ వైరస్‌కు సంబంధించి లక్షణాలను ఎలా ఉంటాయి అనేదాని గురించి నిపుణులు ఇలా తెలియజేశారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మూడు హైబ్రిడ్ కరోనా వేరియంట్లు (XD, XF, XE) వ్యాప్తి చెందుతున్నాయని యూకే లోని హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) అధ్యయన నిపుణులు తెలియజేశారు. ఇప్పుడు ఇంతకీ ఈ కొత్త వైరస్ ఒమిక్రాన్ యొక్క లక్షణాలు ఎలా ఉంటున్నాయి అనేది తెలుసుకుందాం. కరోనా యొక్క రెండు వ్యాక్సిన్ ల డోసులు తీసుకున్న వారిని, అంతే కాకుండా వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి సామర్ధ్యాల అంచనా ప్రకారం మనుషుల ఒక్కొక్కరిలో ఒక్కోరకంగా ఈ వైరస్ యొక్క లక్షణాలు ఉంటాయి.
ఇక ఈ లక్షణాలు ఒక్కోలా ఉంటున్నాయని నిపుణులు చెపుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ వైరస్ వచ్చిన వారిలో ముందుగా గొంతు నొప్పి, జ్వరం, అలాగే గొంతులో మంట, ఇంకా దగ్గు, జలుబు, లేదా చర్మం దాని రంగు మారడం, చర్మం దురద రావడం, జీర్ణకోశ సమస్యలు ఇంకా ఇటువంటి లక్షణాలు ఉంటున్నాయని చెప్పారు. ఇంకా ఈ కొత్త వైరస్ ప్రభావం పెరిగినట్లైయిటే... వారికి గుండెకి సంబందించిన జబ్బులు, అలాగే గుండెదడ, ఇంకా నరాల్లో బలహీనత వంటి అనేక రకాల అనారోగ్య సమస్యల వస్తాయని నిపుణులు తెలియజేశారు. ఇక ప్రపంచ దేశాలలో ఒమిక్రాన్ వేరియంట్ మూడో దశ వచ్చాక... కరోనా బారిన పడిన కేసుల సంఖ్య తగ్గిపోయింది.
అయితే ఈ వైరస్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని చెబుతున్నారు. అలా కాకపోతే.. 4వ వేవ్ ప్రమాదం తప్పదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మాస్క్ లు కూడా ధరించటం లేదు చాలా మంది. కానీ మాస్క్ లు ధరించటం మంచిది అంటే తప్ప తప్పనిసరి కాదు అని పలు రాష్ట్రాలు ప్రకటిస్తున్నాయి. ఇక అమెరికా, చైనా, యుకే , హాంకాంగ్ వంటి దేశాలల్లో ఈ కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. అలాగే భారత దేశంలో కూడా పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయే వరకు కోవిడ్ కి సంబందించిన నిబంధనలను కూడా పాటించటం మంచిదని మన వైద్యనిపుణులు తెలియజేశారు.