పరిశ్రమల కార్మికులకు జగన్ సర్కార్ షాక్ ?
ఇది వేసవి కాలం కావడంతో ఎండలు భగభగ మండి పోతున్నాయి. దానికి తోడు కరెంటు కట్ లు ఉండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం మరొక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీలో ఉన్న అన్ని పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించి షాక్ ఇచ్చింది. మాములుగా ఇప్పటి వరకు కేవలం వీక్ ఎండ్ మాత్రమే పరిశ్రమలు మూతపడేవి. కానీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో మరొక రోజు కూడా పరిశ్రమలు తమ పనులను ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే కాకుండా ఏవైతే ఇండస్ట్రీస్ 24 గంటలు పని చేస్తూ ఉంటాయో అవి ఇప్పటి నుండి కేవలం 50 శాతం కరెంటు ను మాత్రమే వాడుకోవాలని నిర్దేశించింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో పరిశ్రమల యాజమాన్యాలు షాక్ లో ఉన్నాయి. అయితే ఈ ప్రభావం ఖచ్చితంగా ఆయా ఫ్యాక్టరీలు తయారు చేసే ఉత్పత్తులపై పడే అవకాశం ఉంది. అంతే కాకుండా ముఖ్యమైన సమస్య ఒకటి ఉంది. పరిశ్రమలలో పనిచేసే కార్మికులపై కూడా భారం పడే అవకాశం ఉంది. దీనితో వారంలో రెండు రోజుల పాటుగా పవర్ హాలిడే ఉంటుంది కాబట్టి, చాలా మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు పరిశ్రమలను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న వీరికి ఇక సమస్యలు మొదలయ్యాయి. మరి వీటి గురించి ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.