జగన్: ప్రజలు నా చెంత ఉన్నంతవరకూ.. ఎవ్వరూ వెంట్రుక కూడా పీకలేరు?

VAMSI
ఈ మధ్య ప్రత్యర్ధి పార్టీల పై సిఎం జగన్ వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉంటున్నాయి. గతం లో ఎన్నడూ లేని విధంగా  ప్రత్యర్ధుల కు ధీటుగా సమాధానం చెబుతూ ఓ రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మరోసారి ప్రత్యర్ధి పార్టీ పై ఫుల్ ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దౌర్భాగ్య ప్రతిపక్షం,దౌర్భాగ్య ఎల్లో మీడియా అంటూ నేరుగా తెలుగుదేశం పార్టీ పై విమర్శలు కురిపించారు ఏపి సిఎం. ఇటువంటి దౌర్భాగ్య దట్టపుత్రుడు ఉండటం ఆంధ్ర రాష్ట్ర కర్మ అంటూ సంచలన కామెంట్స్ చేసారు జగన్. 


మీరు రాష్ట్ర పరువును తాకట్టుపెడుతున్నారు అని... ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పై రాళ్ళు విసురుతున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ఇవేవీ నన్ను కదిలించలేవు, బెదిరించలేవు అన్న విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. దేవుడి దయ ప్రజల ప్రేమా,వారి చల్లని దీవెనలతోనే  ఈ స్థాయికి వచ్చాను. వారి ప్రేమను,నమ్మకాన్ని పోగొట్టుకునే పని ఎపుడు చేయలేదు, చేయను కానీ నాపై అసూయతో చేస్తున్న ఈ విమర్శలకు ఎంతమాత్రం భయపడను..వారు నా వెంట్రుక కూడా పీకలేరు..నాకు ఇంకా మంచి చేయగలిగే శక్తిని అవకాశాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా  అంటూ చెప్పుకొచ్చారు.


జగన్  ఇంత పెద్ద పదాలు వాడటం వెనుక ఆయన అసహనం దాగి ఉంది అంటున్నారు అభిమాన వర్గ ప్రజలు. ఎంత వీలయితే అంతా చేస్తూ ప్రజల కోసం తన కష్టాన్ని దారబోస్తుంటే ...ప్రజల ప్రేమను పొందుతుంటే, వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఎక్కడా మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుందన్న భయంతో అధికార పార్టీ పై ప్రత్యర్ధి నాయకులు నిందలు వేస్తున్నారని అంటున్నారు. జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ,లూటీ చేస్తోందని,అభివృద్ధి అనేదే లేదని ఆరోపణలు చేస్తూ అమాయకపు ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని ప్రయత్నిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: