జగన్ సర్కార్ కు.. వార్నింగ్ ఇచ్చిన పవన్?
మరీ ముఖ్యంగా పరిశ్రమలకు పవర్ హాలిడే అంటూ జగన్ ప్రభుత్వం ఒక రోజుని ప్రకటించడంపై ప్రతిపక్ష పార్టీ అయినా టిడిపి జనసేన బీజేపీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు విద్యుత్ సంక్షోభం ఏర్పడటానికి ప్రభుత్వ అనాలోచిత విధానాలే కారణం అంటూ జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆరోపించారు. పల్లెల్లో 14 గంటలు పట్టణాల్లో ఎనిమిది గంటల తగ్గకుండా విద్యుత్ కోతలు విధిస్తూ ఉంటే ప్రజలందరూ అల్లాడిపోతున్నారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవాలు జరిగే దుస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలియజేస్తున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక పవర్ హాలిడే ప్రకటనతో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు జనసేనాని.
రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేది అంటూ గుర్తు చేసిన పవన్ కళ్యాణ్.. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొరత లేదు అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం విద్యుత్ ఒప్పందాలు అన్నింటినీ రద్దుచేసి యూనిట్ రెండు రూపాయలకు గ్రీన్ ఎనర్జీ తీసుకువస్తామని చెప్పింది. కోల్ ఎనర్జీని 20 రూపాయలు పెట్టి కొంటుంది. ఉచిత విద్యుత్తు అంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి ఇప్పుడు మాత్రం 57 శాతం చార్జీలు పెంచింది. 200 యూనిట్ల ఉచితంగా అందిస్తామని చెప్పిన సీఎం.. ఇప్పుడు మాత్రం విద్యుత్ చార్జీలు పెంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. ఇక పవర్ హాలిడే వల్ల పారిశ్రామికవేత్తలకు మాత్రమే కాదు అటు సామాన్య కార్మికుల ఉపాధిపై కూడా ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక వ్యక్తిగత అజెండాతో తమ పార్టీని స్థాపించి లేదని తమ సహనాన్ని పరీక్షించవద్దు జగన్ సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రజల పక్షాన అన్ని విషయాల్లో పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అంటూ స్పష్టం చేశారు. ఉద్యోగులు రోడ్డేక్కడానికి కౌలు రైతులు ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని.. ఇక ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుంటే రాక్షసుడూ దుర్మార్గుడూ అని తిడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.