ఏపీ సీఎం జగన్ కు మరో తలనొప్పి... విశాఖలో తీవ్ర వ్యతిరేకత?

VAMSI
నిన్న ఏపి ట్రాన్స్ కో తీసుకున్న కొత్త నిర్ణయం పట్ల అప్పుడే విమర్శలు మొదలు అయ్యాయి. రాష్ట్రంలో విద్యుత్ కోతలను దృష్టిలో ఉంచుకుని పవర్ హాలిడే ని ప్రకటించింది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అనధికారికంగా అమలవుతూ వచ్చిన విద్యుత్‌ కోతలు ఇప్పుడు అధికారికంగా అమలులోకి రావడంతో పరిస్థితులు బట్టి ఏపీ ఈపీడీసీఎల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా విద్యుత్‌ కొరత ఉన్న క్రమంలో విద్యుత్ కోతలు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి.  గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు 24/7 విద్యుత్ సరఫరా ఇచ్చే క్రమంలో పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ అమలు చేయనున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం.

దీని వలన నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలన్నీ కూడా విద్యుత్‌ డిమాండ్‌లో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించడం జరిగింది. మిగిలిన పరిశ్రమలు ఈ ఆదేశాల మేరకు వారానికి ఒక రోజు సెలవు కాకుండా, రెండు రోజులు సెలవు ఇవ్వాలని తెలియజేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమలు రోజుకు ఉత్పత్తి మూడో వంతుకు తగ్గించుకోవాలి అని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇందుకు స్పందించిన పారిశ్రామిక వేత్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. మాతో ఎటువంటి చర్చలు జరపకుండా, కనీసం మా అభిప్రాయం కూడా వినకుండా ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని వాపోతున్నారు.

ప్రస్తుతం విశాఖలో పారిశ్రామిక వేత్తలు, కార్మికులు ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏపి రాష్ట్రం లో పారిశ్రామిక రంగానికి విశాఖ పెట్టింది పేరు. అయితే కొత్తగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పవర్ హాలిడే వలన చాలా నష్ట పోవాల్సి వస్తుందని, న్యాయం కాదని అక్కడ ఎక్కువగా ప్రతిధ్వనిస్తున్నారు. విశాఖ ఆటోనగర్ లో పవర్ హాలిడేపై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పటికే చర్చలు జరిపి ప్రభుత్వ అధికారులతో ఈ విషయం గురించి మాట్లాడాలని, సడలింపులు కొరకు విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది... సడలింపులు ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇది కనుక ఉద్రిక్తం అయితే జగన్ కు మరో తలనొప్పి తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: