అమరావతి : లోకేష్ కు క్లాసు 'పీకు’తున్న నెటిజన్లు
నారావారి పుత్రరత్నం నారా లోకేష్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మూడేళ్ళలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఏం పీకింది ? రాబోయే మంత్రివర్గం మాత్రం ఏమి పీకుతుంది’ ? ఇది లోకేష్ చేసిన విచిత్రమైన వ్యాఖ్యలు. మూడు, నాలుగు శాఖలకు మంత్రిగా పనిచేసిన లోకేష్ కూడా మంత్రివర్గంపై ఇంత చులకనగా మాట్లాడటమే విచిత్రంగా ఉంది. మంత్రులు ఏమి పీకారు ? కొత్తగా రాబోయే మంత్రులు ఏమి పీకుతారు ? అన్నదే నిజమనుకుందాం.
మరి మూడు శాఖలకు మంత్రిగా పనిచేసిన లోకేష్ మాత్రం ఏమి పీకారు ? 2014-19 మధ్యలో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని మంత్రివర్గం ఏమి పీకిందని నెటిజన్లు లోకేష్ ను డైరెక్టుగా క్లాసులు పీకుతున్నారు. ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏమీ పీకలేకపోవటంతోనే కదా 2019 ఎన్నికల్లో జనాలు టీడీపీని నాలుగు పీకి మూలన కూర్చోబెట్టిందని మండిపోతున్నారు. మంత్రులు ఏమి పీకుతారు అనేది వేరే విషయం. ముందైతే టీడీపీని జనాలు నాలుగు పీకింది అయితే వాస్తవమే కదా. నిజానికి నువ్వేం పీకావంటే నువ్వేం పీకావని నేతలు కాదు మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే ఎవరినైనా పీకాల్సింది జనాలే అన్నది వాస్తవం.
జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఏమి పీకిందనే విషయాన్ని జనాలు 2024 ఎన్నికల్లో చెబుతారు. అంతవరకు ఈ పీకులాటల జోలికి లోకేష్ మాట్లాడకుండా ఉండటమే మంచిది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా టీడీపీని జనాలు ఫుల్లుగా అన్నీవైపులా పీకేసిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీని జనాలు పీకిన పీకుడికి లోకేష్ కు ఇంకా జ్ఞానోదయం కలిగినట్లు లేదు. అందుకనే వాళ్ళేంపీకారు, వీళ్ళేం పీకుతారంటు నోటికొచ్చింది మాట్లాడారు.
మంగళగిరిలో తాను పోటీచేస్తే జనాలు పీకింది అప్పుడే లోకేష్ మరచిపోయినట్లున్నారు. మళ్ళీ అదే పీకుడు భాషను మంగళగిరి పర్యటనలోనే ఉపయోగించారు. ఏ మంత్రి ఏమీ పీకలేడు. జనాలు ఒకటేసారి అందరినీ కలిపి ఎన్నికల సమయంలో పీకుతారు. వచ్చే ఎన్నికల్లో జనాలు ఎవరిని ఏ మేరకు పీకుతారనేది ఇప్పటికైతే సస్పన్సే. కాబట్టి లోకేష్ మరో రెండేళ్ళు ఏమీ పీకకుండా ఓపిగ్గా ఉంటే చాలు.