అమరావతి : టీడీపీ అక్కసు తట్టుకోలేకపోతోందా ?
ఎన్నికలై మూడేళ్ళయిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు కూడా మరో రెండేళ్ళలో జరగబోతోంది. అయినా జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబునాయుడు అండ్ కో కు అక్కసు ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగిపోతోంది. దానికి తాజాగా ట్విట్టర్ ఖాతాలో పార్టీ అధికారికంగా చేసిన ట్వీటే నిదర్శనం. ‘ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత దరిద్రమైన సేవలందించిన, పనికిమాలిన మంత్రులకు వీడ్కోలు’ అంటు 18 మంది మాజీ మంత్రుల స్టాంప్ సైజ్ ఫొటోలను పెట్టింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంత్రివర్గంలో 25 మంది ఉంటే టీడీపీ మాత్రం 18 మంది ఫొటోలనే పెట్టింది. పైగా ప్రతి మంత్రి ఫొటోకింద చిన్న కాప్షన్ కూడా జతచేసింది. ఇందులో టీడీపీ నిలువెల్లా రగిలిలపోయే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్నినాని లాంటి వాళ్ళ ఫొటోలు కూడా ఉన్నాయి. మాజీమంత్రులను పట్టుకుని దరిద్రమైన సేవలందించిన, పనికిమాలిన మంత్రలంటు కామెంట్ చేయటంలోనే వీళ్ళంటే తమకు ఎంతమంటో టీడీపీ చెప్పింది. విషయం ఏమిటంటే టీడీపీ కామెంట్ చేసిన మంత్రుల్లో మళ్ళీ ఏడుగురు కొత్త మంత్రివర్గంలో కూడా కంటిన్యు అవబోతున్నారు.
వీళ్ళసేవలు దరిద్రంగా ఉన్నాయని, పనికిమాలిన మంత్రులని సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ప్రజలే కానీ చంద్రబాబునాయుడో, లోకేషో లేకపోతే టీడీపీయో కాదు. 2019 ఎన్నికల్లో టీడీపీ అత్యంత ఘోరంగా ఓడిపోయిందంటేనే జనాలు ఎంతమండిపోయారో అర్ధమవుతోంది. అంటే జనాల దృష్టిలో చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గమే దరిద్రమైన సేవలందించిన పనికిమాలిందని తేల్చేశారు. అందుకనే పార్టీని ఘోరంగా ఓడించటంతో పాటు చాలామంది మంత్రులను ఓడగొట్టారు.
రాజకీయాలన్నాక ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవటం, విమర్శించుకోవటం మామూలే. కానీ అంతిమ తీర్పిచ్చేది మాత్రం జనాలే. ఆ తీర్పే 2019 ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడగొట్టింది. దాంతోనే ఐదేళ్ళు పాలించిన చంద్రబాబు ఎంతటి దరిద్రపు పాలన అందించారో అర్ధమైపోతోంది. అయినా మాజీ మంత్రుల ఫొటోలు పెట్టి ఇంత అసహ్యమైన కామెంట్లను టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిందంటేనే జగన్ అంటే ఎంతటి అక్కుసుతో ఉందో అర్ధమైపోతోంది.