అమరావతి : జగన్ పైనే ఒత్తిడి పెంచేస్తున్నారా ?

Vijaya



వైసీపీలో కూడా విచిత్రమైన పోకడలకు పోతున్నారు నేతలు. మంత్రివర్గం పునర్ వ్యవస్ధీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి భారీ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మీడియా+సోషల్ మీడియాలో అనేక పేర్లతో రకరకాల కాంబినేషన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజం ఉండచ్చు ఉండకపోవచ్చు. అయితే తమ ఎంఎల్ఏకి మంత్రిపదవి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయటంతో పాటు ఇవ్వకపోతే అంటు ఏకంగా జగన్ కే వార్నింగులు ఇస్తుండటమే విచిత్రంగా ఉంది.





ఎంఎల్ఏగా గెలిచిన ప్రతిఒక్కరికీ మంత్రిపదవి కావాలనే ఉంటుంది. కానీ అదిసాధ్యం కాదన్న విషయాన్ని చాలామంది మరచిపోతున్నారు. ఏపీ అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను బట్టి 25కన్నా మించి మంత్రులను తీసుకునేందుకు లేదు. మొత్తం అసెంబ్లీ స్ధానాల సంఖ్యలో మంత్రుల సంఖ్య 15 శాతానికి మించేందుకు లేదు. ఈ లెక్క చూసుకుంటే మ్యాగ్జిమమ్ 25 మందికి మాత్రమే అవకాశముంది. వైసీపీ తరపున గెలిచెంది 151 మంది ఎంఎల్ఏలు. ఇందులో జగన్ను తీసేస్తే మిగలిన 150 మందిలో నుండి 25 మందిని ఎంపిక చేసుకోవటమంటే కష్టమనే.





వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవమటే టార్గెట్ గా పెట్టుకుని జగన్ సామాజికవర్గాల సమీకరణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ విషయాన్ని అందరు గమనిస్తునే ఉన్నారు. మరిలాంటి నేపధ్యంలో జగన్ కు సహకరించాల్సిన ఎంఎల్ఏ మద్దతుదారులు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. మాచర్ల, నెల్లూర రూరల్ ఎంఎల్ఏలు ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మద్దతుదారులు పెద్ద గోల చేస్తున్నారు. 





పిన్నెల్లికి మంత్రిపదవి ఇవ్వకపోతే తమ పదవులకు రాజీనామాలు చేస్తామంటే స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు పెద్ద రచ్చే చేస్తున్నారు. సొంత సామాజికవర్గం ఎంఎల్ఏలను మంత్రివర్గంలోకి తీసుకోలేకపోవటానికి సామాజికవర్గాల సమీకరణలే కారణం. అయినా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలో కూడా ఎంఎల్ఏల మద్దతుదారులే డిసైడ్ చేసేట్లుంటే ఇక ముఖ్యమంత్రి ఏమిచేయాలి ? అయినా జగన్ ఇలాంటి బెదిరింపులకు లొంగేరకం కాదని తెలిసీ గోల చేస్తున్నారంటే ఏదో మీడియాను ఎంటర్ టైన్ చేయటం కోసమనే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: