గోదావరి : ఇద్దరి మధ్యలో పవన్ నలిగిపోతున్నారా ?
తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరుకు బీజేపీతో మిత్రపక్షంగా కంటిన్యుఅవుతున్నా మనసంతా చంద్రబాబునాయుడు దగ్గరే ఉందని అందరికీ తెలిసిందే. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను రక్షించటమే టార్గెట్ గా పవన్ రాజకీయాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్ధితుల్లో బీజేపీతో కంటిన్యు అవలేక అలాగని డైరెక్టుగా చంద్రబాబుతో చేతులు కలపలేక పవన్ నలిగిపోతున్నారట. ఎంతకాలం ఇలా నలిగిపోవాలో అర్ధం కావటంలేదట.
ఇక్కడ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న కసి పవన్లో నరనరాన ఉంది. అయితే అందుకు మార్గాలు మాత్రం దొరకటంలేదు. ఏరకంగా కూడా జగన్ను ఢీ కొట్టేంత సీన్ పవన్లో లేదు. ఆ విషయాన్ని పవన్ తప్ప మిగిలినందరు గుర్తించారు. అందుకనే బీజేపీతో ఉండలేక అలాగని పొత్తును తెంచుకుని బయటకు వచ్చే మార్గం కనబడక అవస్తలు పడుతున్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఓటుబ్యాంకే లేదు. జనసేనకు మొన్నటి ఎన్నికల్లో సుమారు 5.6 శాతం ఓట్లొచ్చాయి.
ఇదే సమయంలో టీడీపీకి మొన్నటి ఎన్నికల్లో 38 శాతం ఓట్లొచ్చాయి. తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల ఓటుబ్యాంకును తీసుకుంటే ఇటు టీడీపీ అటు జనసేన రెండు గల్లంతయిపోయాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. కాకపోతే రెండుపార్టీలు తమ ఓటుబ్యాంకు గణనీయంగా పెరుగుతుందని అంచనాలు వేసుకుంటున్నారు.
ఎవరెన్ని అంచనాలు వేసుకున్నా బీజేపీ ఓటుబ్యాంకు పెరిగేది మాత్ర కల్లే. బీజేపీతోనే ఉంటే జనాగ్రహం తనమీద కూడా పడక తప్పదని పవన్ అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో ఇప్పటికిప్పుడు పొత్తును ఎలా వదిలించుకుకోవాలో అర్ధం కావటంలేదు. పైగా పవన్ మనసంతా చంద్రబాబు వైపుండటాన్ని పార్టీలోని నేతల్లో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతోనే ఏమి చేయాలో అర్ధంకాక పవన్ మానసికంగా నలిగిపోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మరి పవన్ కు సరైన మార్గం ఎప్పుడు కనబడుతుంతో అర్ధం కావటంలేదు.