మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా..? స్టాక్ మార్కెట్లు కుప్పకూలక తప్పదా..?

Deekshitha Reddy
రష్యా అధికారిక మీడియా సంచలన ప్రకటన చేసినట్టు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మూడో ప్రపంచ యుద్దం మొదలైపోయినట్లేనని రష్యా మీడియా పేర్కొందని, ఉక్రెయిన్‌తో యుద్ధంలో, రష్యా యుద్ధ నౌక మాస్కోవా మునకతో దీనికి మహూర్తం కుదిరినట్టు చెబుతోందని వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఛానెల్ వీడియో క్లిప్‌.. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇంతకీ మూడో ప్రపంచ యుద్ధం నిజమేనా..?

రష్యా భారీ యుద్ధ నౌక మాస్కోవా అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ మాత్రం తామే ఆ యుద్ధ నౌకను నాశనం చేశామని చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో రష్యా లోని ఆ న్యూస్ ఛానెల్ మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనని ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇ్పపుడు అందరి మొబైల్స్ లోకి వచ్చేసింది. మూడో ప్రపంచ యుద్ధం అనే పేరు వినగానే అందరూ అలర్ట్ అయ్యారు. అసలేంటా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది ఆ యుద్ధ నౌక దగ్గరే మొదలైందనే విషయం ఆ న్యూస్ ఛానెల్ వార్తలతో బయటపడింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తేలాల్సి ఉంది.

మూడో ప్రపంచ యుద్ధం నిజమైనా, అబద్ధమైనా.. దానికి ముందుగా కొన్ని పరిణామాలు మాత్రం చకచగా జరిగిపోతాయి. ముందుగా స్టాక్ మార్కెట్లు కుప్ప కూలతాయని తెలుస్తోంది. వరుస సెలవల తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్లు తెరుచుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ లో ఒడిదుడుకులు తప్పవని చెబుతున్నారు నిపుణులు. మూడో ప్రపంచ యుద్ధం అనే భయంతో మార్కెట్లు కూప్పకూలే ప్రమాదం ఉంది. అదే నిజమైతే ఆ ప్రభావం మరిన్ని రంగాలపై పడే అవకాశముంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపి, అసలు సంబంధమే లేకుండా వంట నూనెల ధరలు భారీగా పెంచేశారు. మిగతా వస్తువుల రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడిక మార్కెట్లు పడిపోతే.. మరింతగా దాని ప్రభావం ఇతర రంగాలపై కనపడుతుంది. మొత్తమ్మీద రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంక కొనసాగుతూనే ఉండటం మాత్రం ఆందోళనకర అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: