కలకలం రేపుతున్న బీజేపీ కార్యకర్త ఆత్మహత్య!!

P.Nishanth Kumar
నిన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ఇప్పుడు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. పోలీసుల సహాయం తో తమ కార్యకర్త ఆత్మహత్య చేసుకునేలా మంత్రి పువ్వాడ అజయ్ ప్రేరేపించినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. పోలీసుల అక్రమ కేసులు పెట్టి తమ బీజేపీ కార్యకర్త ను ఎంతో మనోవేదనకు గురి చేశారని అందుకే సా యి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. అయన మరణ వాంగ్మూలం కూడా బయటకు రావడం తో సాయి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

తాను ఆత్మహత్య చేసుకోవటానికి కారణం మంత్రి పువ్వా డ అజయ్ వేధింపులే అని సాయి గణేష్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. గతంలో తన పై జరుగుతున్న వేధింపు ల విషయమై పోలీసులకు ఎంత చెప్పిన వారు పట్టించుకోలేదని నేతలు పేర్కొన్నా రు. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి, ఆత్మహత్యలు చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రేరేపిస్తున్నారు అని అయన ధ్వజం ఎత్తారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అరాచకాలు రోజు రోజు కి ఎక్కువవుతున్నాయని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినం దుకు , వారి అన్యాయాలకు ఎదురు నిలిచినందుకు సాయిగణే్‌షపై 16 కేసులు పెట్టారని అంతటితో ఆగకుం డా రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని చూశారని అన్నారు. నేతలతో కలిసి పోలీసులు కూడా వేధింపులు చేయడం తో చివరికి సాయి గణేష్ భరించలేక ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాల ని అన్నారు. ఇకపోతే స్వర్గీయ సాయి గణేష్ అంతిమ యాత్ర నేడు అయన స్వస్థలం ఖమ్మం లో జరిగింది. వేలాదిమంది బీజేపీ శ్రేణుల మధ్య సాయిగణేష్ మృతదేహాన్ని అంతిమయాత్రగా తీసుకొచ్చి అయన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: