మాజీ సీఎం చంద్రబాబు పార్టీని బలోపేతం చేస్తారా?
ఇలా సీనియర్ నేతల వారసులే కాదు.. తటస్థ యువకులను కూడా తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు కార్యక్రమంలో చంద్రబాబు అన్నారు. అలాగే వారిని పార్టీ కోసం పని చేసే యువ నేతలగాను గుర్తించి , మంచి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేసి చెప్పారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు.. పార్టీ యొక్క సంస్థాగత ఎన్నికలు ఓ ప్రతిపాదికంపై ఒక పద్దతిగా చేపట్టడం టీడీపీ పార్టీ ఆనవాయితీ అని కూడా అన్నారు. అయితే ఒక్క సెకనులోనే 8,700 మంది అభ్యర్థులు తమ పార్టీ సభ్యత్వం కోసం తమని అప్రోచ్ అయ్యారని చంద్రబాబు వెల్లడించారు. తనను చంపినా ఫర్వాలేదు.. కానీ జై జగన్ అనే నినాదం చేయనంటే చేయనంటూ చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త చనిపోయారని, అయన లాంటి కార్యకర్తల వల్లే టీడీపీకి బలమని అన్నారు.
ఇక నిజమైన కార్యకర్తలకు తమ తగ్గ గౌరవం ఉండటం లేదనే బాధ కూడా కొందరికి అయితే ఉందని, మరి ఆ బాధను కూడా తప్పించేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు. ఇక అలాగే తమ శక్తిని బట్టి డొనేషన్లు ఇవ్వాలని, ఇంకా సమాజ హితం కోసం టీడీపీ అవసరం అయితే ఉందని, దానికోసమే డొనేషన్లు కొరుతున్నాము అని చెప్పారు. ఇక గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే వాళ్లని, ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇవ్వలేకపోతోందన్నారు. ఇక టిడిపి పార్టీకి అనుకున్న డొనేషన్లు కనుక వస్తే.. ఎవరికైతే సీఎం రిలీఫ్ ఫండ్ దక్కదో వారిలో కొంత మందికైనా సాయం చేసినట్లు అవుతుందని చెప్పారు. ఇక ఏపీకి గడిచిన మూడేళ్లల్లో భారీగానే డామేజ్ జరిగిందని, అలాంటప్పుడు ఏపి రాష్ట్రానికి పునర్ నిర్మాణం చేయాల్సిన అవసరం కూడా ఉన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి టీడీపీ ను తిరుగులేని శక్తిగా తీర్చి దిద్దుతామని మాటిచ్చారు.