వైరల్ వీడియో : యువకుడి చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే?
తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత నమ్మి ఓట్లేసిన ప్రజలకు అసలు పట్టించుకోరు అనే చెప్పాలి. ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా మరచిపోతుంటారు. అయితే ఒకప్పుడు ఓటు వేసిన జనం అటు ప్రజాప్రతినిధులను ఎక్కువగా ప్రశ్నించే వారు కాదు. కానీ నేటి రోజుల్లో మాత్రం యువత అందరిలో అందరిలో అవగాహన వచ్చిన నేపథ్యంలో ఇక ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఏదైనా సమావేశంలో హాజరయ్యారు అంటే చాలు ప్రజలందరూ అక్కడికి చేరుకుని ఎన్నికల ముందు అభివృద్ధి చేస్తాను అంటూ ఇచ్చిన హామీలు ఏం అయ్యాయి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్న ప్రజల పట్ల ఎమ్మెల్యేలు కాస్త దురుసుగా ప్రవర్తిస్తూ ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఎన్నికల ముందు కళ్ళకు కట్టినట్లు చూపించిన అభివృద్ధి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమైంది అంటూ ఓ యువకుడు ఎమ్మెల్యేను నిలదీశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆ యువకుడు చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరమణప్పను ఓ యువకుడు చెంప దెబ్బ కొట్టడం దుమారం రేపింది. తమ గ్రామాలకు రోడ్లు ఎప్పుడు వేస్తారు అంటూ నాగేంద్ర అనే యువకుడు ఎమ్మెల్యే ని ప్రశ్నించాడు. మీ గ్రామాలకు 3.50 కోట్లు మంజూరు చేశామని వారంలో పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పాడు. అయితే ఏ నా కొడుకు మా బాధను వినిపించుకోరు అంటూ అన్నాడు యువకుడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే యువకుడు చెంప పగలగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..