ఖమ్మం సాయి గణేష్ కుటుంబానికి 8 లక్షలు ఇచ్చిన బీజేపీ !

VAMSI
ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన సాయి గణేష్ ఘటన గురించి అందరికి తెల్సిందే, కాగా దీనిపై గవర్నర్ కు బిజెపి వాళ్ళు ఇచ్చిన పిర్యాదు మేరకు ఆమె తెలంగాణ ప్రభుత్వానికి ఆర్డర్ సిపారసు చేయటం కూడా జరిగింది. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే, కాగా మనకు తెలియని ఇంకో విషయం కూడా ఉంది, అదేంటి అంటే గణేష్ కుటుంబ సభ్యులను ఆదుకుంటూ బిజెపి తరపు నుండి రూ. 8లక్షల రూపాయల చెక్కులు ఆ కుటుంబానికి అందజేశాము అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎలాగూ సాయి గణేష్ ను ఆ కుటుంబానికి తెచ్చి ఇవ్వలేము ఇలా అయినా ఆ కుటుంబానికి అండగా ఉంటాం అని పేర్కొన్నారు.

ఇలా జరగటం చాలా దురదృష్టకరం  అని,  అలాగే ఇదేమి నిజాం రాజ్యం కాదు అని …కుటుంబం  రాజకీయాలు తెలంగాణలో చేస్తాము అంటే  ఎవరు ఒప్పుకోరు.. అంతే కాకుండా హుజూరాబాద్ లో ఎలక్షన్ల సమయంలో వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రజలు టిఆర్ఎస్ ను తిరస్కరించి...  ఈటెల రాజేందర్ ను ప్రజలు గెలిపించుకున్నారు. .
ఇక నిజాంను కూల్చి వేసినటువంటి  చరిత్రను కూడా  చూశామని అన్నారు. అలాగే తుమ్మల హాయాంలోనే  రోడ్లు బాగా అభివృద్ధి జరిగాయి.. అంతే కాకుండా ఖమ్మం లో తెరాస పార్టీ ఎటువంటి అభివృద్ధి చేశారో కూడా చెప్పాలని కోరారు. ఇక సాయి గణేష్ ఎక్కడ అయితే ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడే టిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా భూ స్థాపితం చేస్తామని చెప్పారు..

ఇక అలాగే పోలీసులకు  మీరు లక్ష్మణ్ రేఖ దాట వద్దు, మీకు కష్టాలు వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా వచ్చి  అండగా ఉండరు అని పేర్కొన్నారు. ఇక కేటిఆర్ కనుక వస్తే ఏ ప్రాతిపదిక మీద అరెస్టు చేస్తారు… ఇదంతా చూస్తుంటే అచ్ఛం నిజాం పాలన లానే  ఉందని.. అలాగే ఖమ్మం జిల్లాలో  స్కూల్ టీచర్ ని చిత్తూరుకి వెళ్ళి మరి అరెస్టు చేశారంటేనే ఈ  పోలీసుల పని తీరు ఏమిటో కూడా  అర్థం అవుతుంది అన్నారు. అంతే కాదు ఖమ్మంలో రౌడీ షీట్లు ఎంత మందిపై తెరిచారో కూడా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి సాయి గణేష్ అత్మహత్యకు ప్రభుత్వమే ఖచ్చితంగా బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: