తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..ఎంతంటే?
హైదరాబాద్ లో 17 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 19 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా తో ఎవరూ మరనించలేదు. 213 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రం లో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు రాష్ట్రంలో 7,91,739 కరోనా టెస్టులు నమోదవగా.. 7లక్షల 87వేల 469 మంది పూర్తిగా కోలుకున్నారు.. గడిచిన 24 గంటల ల్లో కేవలం 31 మందికి కరొన పాజిటివ్ వచ్చిందని అధికారులు అంటున్నారు..
దేశం మొత్తం మీద 4,36,532 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,593 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.. ఒక్కరోజు వ్యవధిలో మరో 44 మంది కరోనాతో మృరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,22,193కు చేరింది. ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.. దీంతో ఢిల్లీలో కేసులను పెరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటూన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న కూడా మాస్క్ తప్పనిసరిగా వాడాలని కోరుతున్నారు.