హైదరాబాద్ : రెండు పార్టీల్లోను పెద్ద రిలీఫ్ వచ్చేసిందా ?

Vijaya



రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కారణంగా మొదలైన గందరగోళానికి తెరపడింది. గడచిన వారంరోజులుగా ఆయన చుట్టూ తిరుగుతున్న రాజకీయం కారణంగా ఇటు అధికార టీఆర్ఎస్ అటు ప్రతిపక్షం కాంగ్రెస్ నేతల్లో అయోమయం పెరిగిపోయింది. ఇంతవరకు పీకే నోరిప్పకపోయినా రెండుపార్టీల నేతలు మాత్రం ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. దీనికి కారణం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో పీకే ఎవరికి వ్యూహకర్తగా పనిచేయబోతున్నారనే విషయంలో క్లారిటి లేకపోవటమే.



అయితే కాంగ్రెస్ లో పీకే చేరటంలేదనే విషయంలో క్లారిటి వచ్చేయటంతో తెలంగాణాలో అధికార, కాంగ్రెస్ పార్టీల్లో నూరుశాతం రిలీఫ్ వచ్చేసింది. ఈమధ్య వరుసగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పీకే భేటీ అయిన విషయం తెలిసిందే. వారంలో నాలుగుసార్లు వీళ్ళద్దరి మధ్య భేటీలు జరిగాయి. దాంతో పీకే తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జాతయ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ ప్రకటించారు. దాంతో ముందు టీఆర్ఎస్ లో అయోమయం మొదలైంది. రెండు రోజులయ్యేసరికి హైదరాబాద్ కు వచ్చిన పీకే కేసీయార్ తో కూడా రెండురోజులు సమావేశమయ్యారు.




దాంతో కాంగ్రెస్ నేతల్లో అయోమయం మొదలైపోయింది. నాలుగు రోజులు సోనియాతో రెండు రోజులు కేసీయార్ తో భేటీ అవటంతో అసలు పీకే మనసులో ఏముంది ? ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయబోతున్నారో అర్ధంకాక రెండుపార్టీల్లోను అయోమయం పెరిగిపోయింది. ఇదే సమయంలో  పీకే గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ నేతలెవరు ఇష్టపడటంలేదు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ పీకే భవిష్యత్తులో టీఆర్ఎస్ తో పనిచేయరని చెప్పారు.



ఇంతలోనే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పనిచేయక తప్పదని పీకే కాంగ్రెస్ అగ్రనేతలకు చెప్పినట్లు మీడియాలో బాగా ప్రచారమైంది. దాంతో పీకే విషయంలో ఎవరేమి మాట్లాడుతున్నారో, అసలు పీకే ఎవరికి పనిచేయబోతున్నారో తెలీటంలేదు. దాంతో మీడియాలో ఎవరికి తోచింది వాళ్ళు రాసేస్తున్నారు. ఇలాంటి అయోమయానికి మంగళవారం తెరపడింది. కాంగ్రెస్ కు వ్యూహకర్తగా ఉంటానే కానీ చేరటం లేదని ట్విట్ చేయటంతో అయోమయంపై క్లారిటి వచ్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: