అమరావతి : జగన్ పెరుగుతుంటే అచ్చెన్న తగ్గుతున్నారా ?
సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వేడి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో బహిరంగసభలు, రైతు భరోసా యాత్రలు, పార్టీ నేతలతో రెగ్యులర్ గా మీటింగులు పెట్టుకుని ప్రత్యర్ధిపార్టీలపై విరుచుకుపడటం ఎక్కువైపోతోంది. అందుకనే ఎన్నికల వేడి కూడా బాగా రాజుకుంటోంది. ఇలాంటి నేపధ్యంలోనే మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కన్వీనర్లతో జనగ్ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతు మళ్ళీ అధికారంలోకి రావటం పెద్ద కష్టం కాదని, 151 సీట్లు మళ్ళీ తెచ్చుకోవటమే అసలైన గెలుపుగా చెప్పారు. ఇదే సమయంలో అందరం కలిసికట్టుగా కష్టపడితే 175కి 175 సీట్లూ గెలుచుకోవచ్చన్నారు. దాంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కేసింది. అంటే జగన్ టార్గెట్ చేసినట్లు 175 సీట్లు గెలుపును ఎవరు ఊహించుకోవటంలేదు. అలాగే 151 సీట్లు కూడా కష్టమే అనే ప్రచారం ఉంది. కాకపోతే రెండోసారి అధికారంలోకి రావటం మాత్రం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఆమధ్య మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు ఖాయమన్నారు. అచ్చెన్న 160 అనే అంకెను ఏ పద్దతిలో చెప్పారో ఎవరికీ తెలీదు. ఈమధ్య ఏదో కార్యక్రమంలో మాట్లాడుతు పార్టీకి 140 సీట్లు ఖాయమన్నారు. అంటే అచ్చెన్నే 160 నుండి 140కి తగ్గిపోయారు. ఒకసారి ఒక ఫిగర్ చెప్పినతర్వాత ఎప్పటికీ అదే ఫిగర్ మీదుండాలి. 175కి మించి చెప్పేందుకు లేదు కాబట్టి ఎప్పుడు చెప్పినా ఒకే ఫిగర్ చెప్పాలి.
కానీ అచ్చెన్న మాత్రం 20 సీట్లను తగ్గించేశారు. ఇదే సమయంలో మరో ఎంఎల్ఏ జనసేనతో పొత్తు లేకపోతే టీడీపీకి 110-120 సీట్ల మధ్య వస్తుందన్నారు. అంటే టీడీపీ సీట్ల సంఖ్యను తగ్గిస్తుంటే వైసీపీ సీట్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. జగన్ సీట్లసంఖ్యను పెంచుకుంటున్నారంటే ఒక లాజిక్ ఉంది. మరి టీడీపీ సీట్ల సంఖ్యను ఎందుకు తగ్గించుకుంటోంది ?