విజయవాడలో కలకలం రేపుతున్న డ్రగ్స్!

Purushottham Vinay
విజయవాడ నగరంలో డ్రగ్స్‌ కలకలం రేగింది. ఇక గతంలో జరిగిన ఘటనను మరవకముందే మరోసారి మత్తు పదార్థాలు బయటపడటం అనేది ఇప్పుడు పెద్ద సంచనలనంగా మారింది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన సాయిగోపి అనే వ్యక్తి పంపిన పార్శిల్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు బెంగళూరులో గుర్తించడం జరిగింది.ఇక ఆ పార్శిల్ గురించి ఆరా తీయగా.. విజయవాడ నగరం డీటీఎస్ నుంచి సరైన వివరాలతో కెనడాకు వెళ్లినట్లు గుర్తించారు. పార్శిల్ లో నాలుగు కిలోల మత్తు పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన కొరియర్ బాయ్‌ తేజను గత నెల 27 వ తేదీన బెంగళూరుకి పిలిపించి అతన్ని విచారించారు. ఆ తరువాత అతడిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఆ పార్శిల్‌లో పిరిడిన్‌ అనే నిషేధిత డ్రగ్‌ను గుర్తించారు. ఆ తరువాత కస్టమ్స్‌ అధికారులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. డ్రగ్స్ కలకలం రేగడంతో అక్కడ స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ మత్తు పదార్థాలు ఎక్కడ నుంచి వస్తుందనే అంశంపై వివరాలు సేకరించేందుకు రెండు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక బృందాన్ని సత్తెనపల్లికి ఇంకా అలాగే మరో బృందాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారుల వద్దకు పంపారు.


సాయిగోపి ఈ మధ్య రెండు సార్లు పచ్చళ్ల పార్శిల్స్‌ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ టైం లో నిజంగా పచ్చళ్లు పంపాడా? లేదా ఇప్పటి లాగే డ్రగ్స్‌ను పంపాడా? అనే యాంగిల్ లో విచారణ అనేది జరుపుతున్నారు.గతంలో కూడా గుజరాత్ ముంద్రా పోర్టు డ్రగ్స్‌ కేసులో విజయవాడకు ప్రమేయం ఉందన్న వార్తలు పెద్ద సంచలనం సృష్టించాయి. డ్రగ్స్ పై నిజ నిజాలు తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. విజయవాడ, చెన్నై ఇంకా అలాగే కోయంబత్తూర్‌లో ఇవాళ ఎన్ఐఏ సోదాలను చేపట్టింది. అఫ్గాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా ముంద్రా పోర్టుకు హెరాయిన్‌ అనేది సరఫరా అయినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వారి వీధిలోని ఇంటి నెంబర్ 23-14-16 చిరునామాతో మాచవరం సుధాకర్ ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్ట్రర్ చేయడం జరిగింది. ఎన్ఐఏ అధికారులు ఆ ఇంట్లో సోదాలు కూడా చేశారు. అలాగే స్థానికులను విచారించి వాంగ్మూలాలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: