చైనా లో కట్టలు తెచ్చుకుంటున్న కరోనా .. నెగటివ్ వచ్చినా క్వారంటైన్ తప్పదట?

VAMSI
కరోనా వచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా దాని ప్రభావం ఏ మాత్రం తగ్గటం లేదు అని చెప్పుకోవాలి. ఇప్పటికే 3 వేవ్స్ రూపంలో కరోనా వచ్చి ప్రపంచ లోని చిన్న పెద్ద, పేద ధనికా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ముప్పతిప్పలు పెట్టిన కరోనా ఇప్పుడు తాజాగా తన పుట్టినిల్లు అయిన చైనాలో మళ్లీ అల్లకల్లోలం సృష్టిస్తోంది.. దీనితో ప్రజలు తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎంతటి కఠిన నిబంధనలు పాటిస్తున్నప్పటికీ దీని ప్రభావం ఏ మాత్రం తగ్గటం లేదు. దీనితో విసిగి పోయిన అధికారాలు చాలా కట్టుదిట్టమైన నిబంధనలను విధిస్తున్న అదుపు చేయలేకపోతున్నారు. అయితే, ఈ మహమ్మారి నిబంధనల పేరుతో అధికారులు చేసే ప్రయత్నాలు అనేక రకాల విమర్శలకు దారితీస్తున్నాయి.
చైనా లోని షాంఘై సిటీలో కోవిడ్ ని కట్టుదిట్టం చేయటానికి అధికారులు విధించే నిబంధ‌న‌లు చాలా క‌ఠినంగా అమలు పరుస్తున్న విషయం అందరికి తెలిసిందే. కాగా.. దీనితో ప్రజలు ఇప్పుడు క్వారెంటైన్‌కే ప‌రిమితం అవ్వాల్సిన పరిస్థితులు కూడా దాపురించాయి.. మరి ఈ క్రమంలో , కోవిడ్‌ టెస్ట్ లో ఫ‌లితం నెగటివ్ వ‌చ్చిన ప్రజలను కూడా సిటీకి దూరంగా ఉంచిన పాక్షిక నివాస కేంద్రాల‌కు పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే  కేవలం షాంఘై సిటీలోనే  2.5 కోట్ల జ‌న సాంద్రత  ఉండగా.. వారిలో కోవిడ్‌ పాజిటివ్‌గా ఫలితాలు వచ్చిన వారిని మాత్రమే .. క్వారెంటైన్ సెంటర్లకు పంపిస్తున్నారు అధికారులు.
మరి ఇది ఇలా ఉండగా నెగిటివ్‌ రిపోర్ట్‌ ఫలితాలు వచ్చిన వారికి కూడా పాజిటివ్‌ పేషెంట్స్ ఉంచిన క్వారంటైన్‌ సెంటర్లకే పంపుతున్నట్లు అధికారులపై ఫిర్యాదులు అందుతున్నాయట. కాగా దీనికి అధికారులు మాత్రం వారిని వైర‌స్ బారిన పడకుండా ఉండేందుకే ఇలా క్వారెంటైన్‌కు పంపుతున్నట్లు చెబుతున్నారు. ఇదంతా కూడా నిజమే అయితే మరి అధికారులు చెబుతున్నట్లుగా జూన్ లో 4 వేవ్ కూడా సంభవిస్తుంది అనే వార్తలు కూడా వాస్తవమే అని నమ్మక తప్పేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: