హైదరాబాద్ : ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారతదేశంలో పెద్ద మహానగరాలలో బాగా అభివృద్ధి చెందుతున్న మహా నగరం. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు చూసినా కూడా చాలా రద్దీగా ఉంటుందనే చెప్పాలి. మెట్రో వచ్చాక కూడా హైదరాబాద్ ట్రాఫిక్ అసలు తగ్గడమే లేదు.ఎంత అదుపు చెయ్యాలని చూసినా కానీ అసలు హైదరాబాద్ లో రోజు రోజుకూ కూడా ట్రాఫిక్ అనేది మరింతగా పెరిగిపోతోందనే చెప్పాలి.మెయిన్ రోడ్డు మొదలుకొని అన్ని దారుల్లో కూడా నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు అనేవి అస్సలు తప్పడం లేదు.ఇక ఇలా భారీ ట్రాఫిక్ తో సతమతమౌతున్న నగరవాసులకు కాస్త ఊరటనిచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.ఇక ఈ క్రమంలోనే జంట నగరాలైన హైదరాబాద్ ఇంకా అలాగే సికింద్రాబాద్ ట్రాఫిక్ విషయంలో భారీ మార్పులకు రంగం రెడీ అయ్యింది.ఎంతో అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో వాహనాల రాకపోకల నియంత్రణలో విజయం సాధిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇక మరో వినూత్న పద్ధతిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.
ఇక పెరుగుతున్న వాహనాలతో పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ ల పరిష్కారానికి కొత్త విధానాన్ని అమలు చేయాలని డిసైడ్ చేశారు.ఇందులో భాగంగా గూగుల్ కంపెనీ భాగస్వామ్యంతో ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వాహనదారులకు అందించేందుకు వారు ప్లాన్ చేశారు.ఇక ఇందుకు పోలీసులను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను వినియోగించడం ద్వారా అనుకోకుండా జరిగే సంఘటనలు, వీవీఐపీల రాకపోకలు, ర్యాలీలు ఇంకా అలాగే ధర్నాలు కారణంగా అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే ట్రాఫిక్ జామ్ ల ప్రభావాన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు ఖచ్చితంగా సమాచారం అందే విధంగా గూగుల్ మ్యాప్ లో వారు అప్డేట్ చేయనున్నారు.