అమరావతి : పవన్ పరువు పోగొట్టుకుంటున్నారా ?

Vijaya



దారినపోయే చెత్తను నెత్తినేసుకోవటంలో జనసేన అదినేత పవన్ కల్యాణ్ ను మించినవారు లేరు. ఇప్పటికే పవన్ పైన చంద్రబాబునాయుడు దత్తపుత్రుడనే ముద్ర బలంగా పడిపోయింది. వీలైతే దాన్ని చెరిపేసుకోవటానికి ప్రయత్నించాల్సిన పవన్ పదే పదే తాను దత్తపుత్రుడినే అనేట్లుగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిపైన చంద్రబాబు ఏవైతే ఆరోపణలు, విమర్శలు చేస్తారో వాటినే కొద్దిరోజుల తర్వాత పవన్ రీమేక్ చేస్తుంటారు.



సొంతంగా ఆరోపణలు, విమర్శలు చేసేంత సీన్ తనకు లేదని చాలాసార్లే నిరూపించుకున్నారు. అందుకనే చంద్రబాబు ఆరోపణలనే తిరిగి పవన్ చేస్తుంటారు. దాంతో చంద్రబాబు రాజకీయప్రయోజనాలను కాపాడేందుకు మాత్రమే పవన్ పార్టీపెట్టారనే విషయం జనాల్లో బలంగా నాటుకుపోయింది. ఇపుడిదంతా ఎందుకంటే పవన్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే  ‘శ్రీలంక నుండి తమిళనాడుకు గంటదూరం. శ్రీలంక పరిస్ధితికి ఆంధ్రప్రదేశ్ పరిస్ధితికి కూతవేటు దూరం. ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించటం, గడప గడపకు ఎంఎల్ఏలను పంపటంకాదు చేయవలసింది. మీరు చేసిన అప్పులనుండి ఆంధ్రప్రదేశ్ ను దూరం జరిపే ప్రయత్నం చేయండి’ . అని అన్నారు.



నిజానికి ఇలాంటి ఆరోపణలే చంద్రబాబు చేస్తున్నారు. శ్రీలంలో అప్పులకు, ఏపీలో అప్పులకు అసలు పోలికేలేదన్న విషయం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు చెబుతారు. శ్రీలంక అనేది దేశమైతే ఏపి కేవలం ఒక రాష్ట్రం మాత్రమే. కాబట్టి శ్రీలంకలో పరిస్ధితి ఏపిలో ఎప్పటికీ రాదు. శ్రీలంకలో పరిస్ధితి దేశంలో వస్తే అప్పుడు ఏపీలో కూడా అదే పరిస్ధితి ఉండచ్చంతే. ఇదంతా తెలీకుండానే చంద్రబాబు అంటున్నారు కాబట్టే తను కూడా అదే ఆరోపణలను పవన్ చేసేశారు. చంద్రబాబు ఆరోపణలే తప్పని ఆర్ధికవేత్తలంటుంటే మళ్ళీ అవే ఆరోపణలను పవన్ చేయటమే విచిత్రం. ఇక్కడే పవన్ కు విషయ పరిజ్ఞానం లేదని అర్ధమైపోయింది.




నిజంగానే పవన్ అప్పుల విషయంలో బాధపడుతుంటే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులెన్నో ముందు తెలుసుకోవాలి. లేదా ఆ విషయంపై చంద్రబాబునే ప్రశ్నించాలి. అలాగే నరేంద్రమోడి సర్కార్ చేసిన అప్పులెన్నో తెలుసుకోవాలి. మనదేశం అప్పు సుమారు ఒకకోటి 24 లక్షల కోట్ల రూపాయలు.  దేశంమొత్తంమీద అప్పులేని రాష్ట్రమేదైనా ఉంటే పవన్ చూపించగలరా ?




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: