దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు...
కాబట్టి వీరు కనుక వైరస్ భారిన పడితే రెండు చేరి పెద్ద సమస్యగా మరే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి వారు నిబంధనలను పాటిస్తూ, జాగ్రత్తగా ఉండటం ఉత్తమం అంటున్నారు. ఇక దేశం లో కరోనా వైరస్ గురించి తాజా అప్డేట్స్ చూద్దాం. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్ళీ గణనీయంగా పెరుగుతున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా గత 24గంటల్లో కొత్తగా 4,041 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. మరో 10 మంది కరోనా బాధితులు ఈ మహమ్మారి కారణంగా మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 2,363 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21,177 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు పేర్కొంది.
ఇక కరోనా వ్యాక్సినేషన్ విషయానికొస్తే, దేశంలో ఇప్పటి వరకు 193.83 కోట్ల టీకా డోసులను పంపిణీ జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్షలు 85.17 కోట్లు కు పైగా దాటాయని లెక్కలు చెబుతున్నాయి. బూస్టర్ డోసు లు వేసుకోవాలని ప్రజల్ని కోరుతున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా మునుముందు కరోనా ముప్పు నుండి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు.