ఆన్లైన్ లో లిక్కర్ డోర్ డెలివరీ... క్వాలిటీ ఉంటుందా?
ఇన్నొవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 'బూజీ' బ్రాండ్ పేరుతో హైదరాబాద్ లో ఈ సర్వీసును కొత్తగా ప్రారంభించారు. కానీ ఈ సర్వీసు ప్రస్తుతానికి కోల్కతాలో మొదలయ్యింది. త్వరలోనే పలు సిటీల్లో కూడా ఈ సర్వీసులు మొదలు పెట్టే అవకాశం ఉందని అన్నారు. కాగా ఇప్పటికే చాలా సంస్థలు ఇలా మద్యాన్ని డోర్ డెలివరీ ఇస్తున్నారు. కాకపోతే ఇప్పటికే ఉన్న కొన్ని డెలివరీ సంస్థలు కాస్త లేట్ గా అందిస్తుండగా.. ఈ కొత్త సంస్థ మాత్రం పదే పది నిమిషాల్లో మీరు ఆర్డర్ చేసిన లిక్కర్ ను డెలివరీ అందించే విధంగా ప్రణాళికలు చేశారు. ఈ విషయం తెలిసిన మనదన్నలు చిందులు వేస్తున్నారు.
అయితే ముందుగా పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్న అనంతరం కోల్‌కతాలోని తూర్పు ప్రాంతంలో ఈ సర్వీస్‌ను మొదలు పెట్టనున్నట్లు ఓ ప్రకటనలో ప్రకటించింది ఆ సంస్థ. అలాగే ఆన్లైన్ డెలివరీ అయినప్పటికీ లిక్కర్ లో ఎటువంటి అవకతవకలు జరగకుండా క్వాలిటీ ఉండేలా చూసుకుంటామని తెలిపింది.ఈహతే ఈ వార్త గురించి తెలిసిన కొందరు మద్యం ప్రియులు హుషారులో ఉన్నారట. ఇక ఇది ఎప్పుడెప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.