విమాన ప్రమాణంలో మాస్కు లేకుంటే కఠిన చర్యలే!

Purushottham Vinay
కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కోరలు చాచి విస్తరిస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఖచ్చితంగా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుండటంతో విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఢిల్లీ ధర్మాసనం పిలుపునిచ్చింది. ఎయిర్పోర్టులో విమానాల్లో ప్రయాణికులు కచ్చితంగా మాస్కు ధరించేలా చర్యలు చేపట్టాలని కూడా సూచించింది.ఇక ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. కొవిడ్ 19 నిబంధనలు పాటించని వారిని విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించకూడదని కూడా తేల్చి చెప్పింది.కరోనా వైరస్ నిబంధనల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిల్పై ధర్మాసనం విచారణ జరిపింది. కరోనా మహమ్మారి నిబంధనలు అమలు చేయడమే కాకుండా.. ఉల్లంఘించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు విమానాల సిబ్బందికి పూర్తి అధికారాలు కూడా ఇస్తూ కరోనాకి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను కూడా జారీ చేయమని డీజీసీఏని ఆదేశించింది. 




పైగా నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై జరిమానా విధించడం తో పాటు సదరు వ్యక్తుల పేర్లను కూడా నో ఫ్లై లిస్ట్లో ఉంచాలని కూడా చెప్పింది. తినేటప్పుడు లేదా ఏదైనా తాగేటప్పుడు మాస్క్ ని తొలగించేలా చిన్న వెసులు బాటుని కూడా కల్పించింది.ఇప్పటికే మన దేశంలో ఇవాళ 4వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ మహారాష్ట్రలలో అయితే భారీ సంఖ్యలో ప్రజలు కొవిడ్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ పటిష్ట చర్యలు అనేవి చేపడుతున్నాయి. కరోనా వైరస్ నిబంధనలను కఠినతరం చేసి కచ్చితంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.. ఈ నిబంధనలు పాటించకపోతే ఆంక్షలు విధించాల్సి వస్తుందని ప్రభుత్వాలు అనేక రకాల హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: