ఇక అమరావతివాసులకూ వెంకన్న దర్శన భాగ్యం
ఆదివారం అంటే ఇవాళ ఉదయం పుణ్యాహవచనం, పంచగవ్యాధివాసం చేపట్టారు. ఈ సాయంత్రం హోమాలు నిర్వహిస్తారు. జూన్ 6న ఉదయం నవ కలశ స్నపన క్షీరాధివాసం, సాయంత్రం హోమాలు, యాగశాల వైదిక కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 7న ఉదయం చతుర్ధశ కలశ స్నపన జలాధివాసం, సాయంత్రం యాగశాల నిర్వహిస్తారు. ఇక జూన్ 8న ఉదయం 10.45 నుండి 11.30 గంటల వరకు విమాన కలశ స్థాపన ఉంటుంది. ఆ తర్వాత గోపుర కలశ స్థాపన, విగ్రహ స్థాపన ఉంచాయి. ఆ రోజు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం చేపడతారు. సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, రాత్రి యాగశాల కార్యక్రమాలు ఉంటాయి.
ఆ తర్వాత జూన్ 9న ఉదయం మహా పూర్ణాహుతి, విమాన గోపుర కలశ ఆవాహన ఉంటాయి. ఆ రోజు ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు మిథున లగ్నంలో ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తారు. ఆ తర్వాత మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 10.30 నుండి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆ రోజు సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శాంతి కల్యాణోత్సవం జరుగుతుంది.
ఈ మహా పుణ్య కార్యక్రమాల్లో టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీ గుణభూషణ్ రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయ సారథి, ఎఈవో శ్రీ దొరస్వామి నాయక్ వంటి వారు ఎందరో పాల్గొంటారు.