వారెవ్వా.. ఈ కండక్టర్ ఎంత గొప్ప పని చేస్తున్నాడబ్బా?
ఎందుకంటే సంపన్నులు అయితే ఏసీ కార్ లలో వెళ్తూ ఉంటారు. వారికి బయట ఎండ ఉన్నా వాన ఉన్నా వారికి నో ప్రాబ్లం. కానీ సామాన్యులు బస్టాపు లో ఎండలో బస్సుల కోసం పడిగాపులు కాస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక బస్సు లోకి ఎక్కిన తర్వాత హమ్మయ్య అనుకుంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. మరి కాస్త ఉపశమనం కలిగించేందుకు కాస్త నీరు తాగితే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటారు.
ఈ క్రమం లోనే ఇలా తాను పనిచేసే బస్సులో ఎక్కిన ఉన్నవారికి దాహాన్ని తీరుస్తూ గొప్ప పని చేస్తున్నాడు ఇక్కడ కండక్టర్. హర్యానాకు చెందిన ఆర్టీసీ కండక్టర్ సురేందర్ శర్మ చేస్తున్న పనికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేక పోతున్నారు. బస్సు లో ఎక్కిన ప్రయాణికులకు టికెట్ కంటే ముందు ఇక చెంబు లో మంచినీళ్లు ఇస్తూ ఉండడం గమనార్హం. ఎండలో ఇబ్బందిపడిన ప్రయాణికులు సురేందర్ నీళ్లు ఇవ్వగానే తాగి ఎంతగానో ఉపశమనం పొందు తున్నారు. దీని కోసం బస్సులో ఒక వాటర్ క్యాన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఈ కండక్టర్. ఏదిఏమైనా అతను చేసిన ఆలోచనపై మాత్రం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు..