బీజేపీ-వైసీపీ మైండ్ గేమ్.. ఏపీ ప్రజలు అంత అమాయకులా..?

Deekshitha Reddy
ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా.. జాతీయ స్థాయిలో బీజేపీ, వైసీపీ ఒకే మాటపై ఉన్నాయనేది వాస్తవం. రాష్ట్రంలో పోటీ ఉన్నా కూడా జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు వైసీపీ మద్దతుగా ఉంటోంది. అయితే ఇప్పుడు సడన్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నడ్డాపై, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కూడా విచిత్రంగానే తోస్తోంది. ఓవైపు రాష్ట్ర పతి ఎన్నికల్లో వైసీపీ సపోర్ట్ కోరుకుంటున్న బీజేపీ, ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రం విచిత్రమే. దానికి కౌంటర్ గా బీజేపీని మరింత దారుణంగా వైసీపీ విమర్శించడం మరీ విచిత్రం.

పచ్చి అబద్దాలు చెప్పేందుకు ఢిల్లీ నుంచి జేపీ నడ్డా ఎగేసుకుని వచ్చారంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. రాజమండ్రిలో మీటింగ్ పెట్టిన నడ్డా, అక్కడికి కూతవేటు దూరంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు నాని. ఏపీకి 8 లక్షల కోట్ల అప్పు ఉందని నడ్డా విమర్శలు చేశారని, అయితే రాష్ట్ర ప్రభుత్వ అప్పు కూడా తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో బీజేపీ ఉందని విమర్శించారు నాని.

ఒకవేళ నిజంగా ఏపీ హద్దులు దాటి అప్పు చేస్తుంది అనుకుంటే.. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయొచ్చుకదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి, ఆర్బీఐ లు ఏం చేస్తున్నాయని, తాము పరిధికి మించి అప్పు చేయకుండా ఆపొచ్చుకదా అని ప్రశ్నించారు నాని. అప్పుడు కళ్లు మూసుకున్నారా అని విమర్శించారు. బీజేపీకి అధికారం వచ్చేనాటికి దేశ అప్పు రూ.53 లక్షల కోట్లు ఉంటే.. ప్రస్తుతం దేశానికి ఉన్న అప్పు రూ.130 లక్షల కోట్లకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు నడ్డా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: