'పెరుగుతున్న కరోనా కేసులు'... నిర్లక్ష్యం కుదరదిక ?

VAMSI
దేశంలో కరోనా ఉదృతి క్రమంగా పెరుగుతోంది. తీవ్రత సంగతి అటుంచితే వ్యాప్తి మాత్రం వేగంగా ఉంటుంది. కేసులు పెరుగుతున్న ప్రభావం పెద్దగా లేదని పలువురు వైద్య నిపుణులు చెబుతుండగా..వ్యాప్తి వేగం మరింత పెరిగితే మళ్ళీ వైరస్ ప్రళయం మొదలవుతుందనీ అందుకే ఇప్పటి నుండే జాగ్రత్త తప్పనిసరి అని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కరోనా ముప్పు ఇప్పటికీ పొంచే ఉందని నియమాలు తప్పనిసరిగా పాటించడం అవసరమని అంటోంది. ఇది ఇలా ఉండగా దేశంలో కేసుకు మళ్ళీ కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నాయి. రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు చెందుతున్నారు. వరుసగా రెండోరోజు దేశంలో 7 వేలకు పైగా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించడంతో మళ్ళీ కలవరం మొదలయ్యింది.

ఇక పెరుగుతున్న కేసుల గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుతున్నాయి.  
నిన్నటి హెల్త్ బులెటిన్ ప్రకారం 7,240 కేసులు రిజిస్టర్ కాగా..24 మంది కరోనా కారణంగా మరణించారు. దాంతో మొత్తంగా ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 5,24,747కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3.35 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు సమాచారం. అందులో కొత్తగా 7,584 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.  ఇక నిన్న 3,791 మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 4,26,44,092 కి చేరింది. గత రెండు రోజుల నుండి కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మహారాష్ట్రలో అత్యధికంగా 8813 కేసులు బయటపడటం గమనార్హం.

ఆ తర్వాతి స్థానంలో కేరళ, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా లు అత్యదికంగా కరోనా కేసులను కలిగి ఉన్నాయి. కేరళలో ౨,193, కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఢిల్లీలో 622, కర్ణాటకలో 471, హర్యానాలో 348 కేసులు రిజిస్టర్ అయ్యాయి. కొత్తకేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో.. రికవరీ రేటు 98.70 శాతానికి తగ్గింది. మరోవైపు బ్యాక్ స్టేషన్ కార్యక్రమం కూడా వేగంగా సాగుతోంది చాలా మంది ప్రజలు ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వ్యాక్సిన్ సెంటర్లకు తరలి వస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే  మళ్ళీ గత పరిస్థితులు ఎదొర్కొ వాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: