ఏపీ సీఎం ఎవరు... పబ్లిక్ టాక్ ఇదే ?
అయితే ఇక్కడ పొత్తుల గురించి కూడా హైలైట్ అవుతోంది. వైసీపీ మీద టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా ? లేదా ఇంతకు ముందులాగా జనసేనతో కలిసి పోటీకి వెళుతుందా ? అదే విధంగా జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయా అన్న పలు ఆప్షన్స్ తో ఎన్నికలు రంజుగా సాగనున్నాయి. అయితే ఎవరు ఏ విధంగా పోటీ చేసినా సీఎం అయ్యేది ఎవరు అంటూ సామాన్య ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రకారం చూస్తే వైసీపీకి గ్రాఫ్ భారీగా తగ్గిపోయింది. అయితే ఈ గ్రాఫ్ వైసీపీ ని ఓడించేంతగా ప్రభావం చూపుతుంది అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
వైసీపీ గెలిస్తే... జగన్ మరోసారి సీఎంగా అధికార పీఠం మీద కూర్చుంటాడు. ఒకవేళ టైం సరిలేక టీడీపీ గెలిస్తే ఇక చివరిసారి సీఎంగా చంద్రబాబు గద్దెనెక్కుతాడు. ఇలా కాకుండా టీడీపీ జనసేన కూటమిలో గెలిస్తే ఎవరు సీఎంగా అవుతారు అన్నది ఇక్కడ మరో ప్రశ్న. ప్రచారంలో ఉన్న ఒప్పందం ప్రకారం పవన్ ను సీఎం చేయాలి. మరి టీడీపీ కార్యకర్తలు ఇందుకు ఒప్పుకుంటారా లేదా అన్నది ఒక సందేహం. ఇలా ఎన్నో మతలబులు ఉన్నాయి. ఇవన్నీ తేలాలంటే అసలు అన్ని పార్టీలు ఎలా ఎన్నికలకు వెళ్లనున్నాయి అన్నది తెలియాల్సి ఉంది.