అమరావతి : వచ్చే ఎన్నికలపై ఎల్లోమీడియా నిజాలు ఒప్పుకున్నదా ?

Vijaya




చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాలు కాపాడటమే ధ్యేయంగా, జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లటమే టార్గెట్ గా ప్రతి ఆదివారం ఎల్లోమీడియాలో అచ్చయ్యే కొ(చె)త్తపలుకులో ఈ వారం కొన్ని నిజాలు అంగీకరించింది. మళ్ళీ ఇందులో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ గురించి రాసేటపుడు సలహా, సూచనలుగాను జగన్ గురించి రాసేటపుడు జనాభిప్రాయమంటు పాపం నానా అవస్తలు పడ్డారు. హోలు మొత్తంమీద ఈవారం పలుకు చదివిన తర్వాత అర్ధమైందేమంటే  వచ్చేఎన్నికల్లో చంద్రబాబుకు అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువని అంగీకరించటమే.





38 శాతం ఓటుబ్యాంకున్న టీడీపీ, 5 శాతం ఓటుబ్యాంకున్న జనసేనపై ఆధారపడిందని ఎల్లోమీడియా తెగబాధపడిపోయింది. జనసేనతో పొత్తుకు పవన్ మూడు షరతులను ప్రకటించటాన్ని కూడా ఎల్లోమీడియా తట్టుకోలేకపోయింది. జనసేన కలిసిరాకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అవటం కష్టమనే భయం స్పష్టంగా కనబడింది. అధికారాన్ని వదులుకోవటానికి జగన్ ఏమాత్రం ఇష్టపడడనే విషయాన్ని ఎల్లోమీడియా గుర్తుచేసింది.





అప్పుడు చంద్రబాబు బాటలోనే ఇపుడు జగన్ కూడా వెళుతున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమితప్పదనే ఆశ ఎల్లోమీడియాలో కనబడింది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే అప్పటి చంద్రబాబు ఘోరఓటమిలో ఎల్లోమీడియాకు కూడా ప్రధాన బాధ్యతుంది. జనాల్లో వ్యతిరేకత బయటకు కనబడకుండా యథాశక్తి కప్పెట్టేసింది. ప్రజలంతా చంద్రబాబునే సీఎంగా కోరుకుంటున్నట్లు జనాల అభిప్రాయంపేరుతో పోల్ కూడా నిర్వహించింది. టీడీపీ ఘోరపరాజయంలో అప్పట్లో తానుకూడా పెద్ద బండను పడేసిన ఎల్లోమీడియా ఇపుడు నీతులు చెబుతుండటమే విచిత్రంగా ఉంది.






ఇక 175కి 175 సీట్లు గెలవాలని జగన్ కోరుకోవటం ప్రకృతి విరుద్ధమట. ప్రతిపక్షాలు లేకుండా ఉండాలని జగన్ కోరుకోవటం మహాపరాధంగా కనబడింది. మరప్పట్లో చంద్రబాబు కూడా ఇలాగే కోరుకున్న విషయాన్ని ఎల్లోమీడియా మరచిపోయిందా ?  కుప్పంలో చంద్రబాబును ఓడించాలని జగన్ అనుకోవటం తప్పెలాగవుతుంది ? పులివెందులలో జగన్ను ఓడిస్తామని అప్పట్లో చంద్రబాబు చాలెంజ్ చేయలేదా ? హోలు మొత్తంమీద చూస్తే జగన్ ఓడించటం చంద్రబాబు+పవన్ కు సాధ్యంకాదని తేల్చేశారు. అలాగే జనసేన పార్టీ కాపులకు మాత్రమే పరిమితమైందని. జగన్ను ఓడించాలని అనుకుంటున్న టీడీపీలో చాలా సమస్యలున్నాయని ఇపుడు చెప్పారు.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: