అమరావతి : మిత్రపక్షానికి గెడ్ బై చెప్పేసినట్లేనా ?

Vijaya



క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల తలెత్తిన పరిణామాల కారణంగా మిత్రపక్షాలైన జనసేన-బీజేపీ మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తుపెట్టుకోవాలంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు ఆప్షన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూడు ఆప్షన్లు ఇటు బీజేపీతో పాటు అటు టీడీపీకి కూడా వర్తించేట్లుగా పవన్ ప్రకటించారు.



సరే టీడీపీ అంటే ప్రస్తుతానికి జనసేనకు బహిరంగంగా ఏమీ కాదుకాబట్టి వాళ్ళు కాదన్నా ఇబ్బందిలేదు. ఇదే సమయంలో మిత్రపక్షమైన బీజేపీ నేతలు కూడా కాదనటంతో పవన్ ఇగో హర్టయ్యింది. దాంతో వెంటనే రెండుపార్టీలకు బుద్ధిచెప్పాలన్న మంటతో అక్టోబర్ 5వ తేదీ విజయదశమి నుండి రాష్ట్రంలో బస్సుయాత్ర ప్రకటించేశారు. ఈ యాత్రలో ఎక్కడా బీజేపీతో కలిసి చేయబోతున్నట్లు చెప్పలేదు.



యాత్రకు సంబంధించిన బస్సు రూటుకానీ, నిర్వహించాల్సిన సమావేశాలు, బహిరంగసభలు, చేయాల్సిన బస ఇలా అన్నీ విషయాలను పవన్ కేవలం తమ నేతలతో మాత్రమే మాట్లాడుతున్నారు. జనసేన నేతలు కూడా జిల్లాల్లోని పార్టీ నేతలతో మాత్రమే భేటీలు పెట్టుకుంటున్నారు. యాత్రకు సంబంధించిన కసరత్తులో ఎక్కడా బీజేపీ నేతలను ఇన్వాల్వ్ చేయటంలేదు. అంటే మానసికంగా బీజేపీకి పవన్ దాదాపు గుడ్ బై చెప్పినట్లే అర్ధమైపోతోంది.



షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడిపోతున్న ఈ తరుణంలో మిత్రపక్షాల మధ్య తలెత్తిన వివాదం ఎలా పరిష్కారమవుతుందో ఎవరికీ అర్ధం కావటంలేదు. అలాగే ఏదోరోజు టీడీపీ+జనసేన కలిసిపోతాయని అందరు అనుకుంటున్న సమయంలో పవన్ ఇచ్చిన ట్విస్టుకు తమ్ముళ్ళు మండిపోతున్నారు. చివరకు టీడీపీతో పవన్ చేతులు కలుపుతారో లేదో తెలీదు కానీ బీజేపీతో మాత్రం కలిసి వెళ్ళే అవకాశాలు దాదాపు లేవన్న విషయం అర్ధమైపోతోంది.  ఇప్పటికైతే మిత్రపక్షంతో ఎలాంటి సంబంధంలేకుండానే బస్సుయాత్ర చేయాలని డిసైడ్ అయిపోయిన పవన్ అధికారికంగా ఎప్పుడు గుడ్ బై చెప్పేస్తారో అనే ఆసక్తి పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: