కోస్తా : వీళ్ళకి జగన్ మాటంటె లెక్కలేదా ?

Vijaya



క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈనెల 23వ తేదీన నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీచేస్తున్నారు. వైసీపీ అభ్యర్ధికి పోటీగా బీజేపీతో పాటు మరికొందరు చిన్నా చితక పార్టీలు, స్వతంత్రులు పోటీచేస్తున్నారు. ఉపఎన్నికలో గెలుపు గురించి వైసీపీకి అసలు రెండో ఆలోచనే లేదు. కానీ మెజారిటి ఎంతన్నదే కీలకమైంది.



ఉపఎన్నికలో లక్ష ఓట్ల మెజారిటి రావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. పోటీయే లేని ఉపఎన్నికలో లక్షమెజారిటి అన్నది పెద్ద కష్టమేమీకాదు. అయినా ఎందుకైనా మంచిదని మంత్రులు, ఎంఎల్ఏలకు మండలాలవారీగా జగన్ బాధ్యతలు అప్పగించారు. అయితే మంత్రులు, మాజీలతో పాటు ఎంఎల్ఏల్లో చాలామంది అసలు ప్రచారంలోకే దిగలేదని చెప్పుకుంటున్నారు. ఎప్పుడైనా వచ్చినా ఏదో మొక్కుబడిగా కాసేపు తిరగటం, ఎక్కడో ఒకచోట మీడియా సమావేశం పెట్టి వెళ్ళిపోతున్నారట.



కాసేపు తిరగటం, మీడియా సమావేశం పెట్టడం ఎందుకంటే తాము కూడా ప్రచారంలో పాల్గొన్నామని చెప్పుకోవటం కోసమే. మంత్రులందరిలోకి రోజా మాత్రమే మండలంలోనే ఉండి బాగా ప్రచారం చేస్తున్నారట. మాజీమంత్రులు అనీల్, కొడాలినాని, జిల్లా మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి కానీ మాజీమంత్రులు పెద్దగా కనబడటంలేదని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. నిజానికి జిల్లామంత్రిగా కాకాణి అందరినీ కో ఆర్డినేట్ చేసుకోవాలి. నియోజకవర్గంలో అంతా తానే అయి వ్యవహరించాలి.



అయితే కారణాలు తెలీదుకానీ పెద్దగా ఇన్వాల్వ్ అవలేదనేది పార్టీ నేతల మాట. ఇక నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి గురించి ఎంత తక్కువచెప్పుకుటే అంతమంచిది. అభ్యర్ధి గెలుపుకోసం తీసుకోవాల్సినంత చొరవ తీసుకోలేదట. మరీ విషయాలు జగన్ దృష్టిలో ఉన్నాయా లేవా అన్నదే అనుమానంగా ఉంది.  పార్టీ వర్గాల సమాచారం ప్రకారమైతే జగన్ ప్రతిరోజు రిపోర్టులు తెప్పించుకుంటున్నారట. అదే నిజమైతే ప్రచార బాధ్యతలు అప్పగించినవారితో మాట్లాడాలి కదా. జగన్ మాటనే వీళ్ళు లెక్కచేయటం లేదా అనే డౌటు పెరిగిపోతోంది. లేకపోతే ఎలాగూ లక్ష మెజారిటి ఖాయమని జగన్ తో పాటు అందరు రిలాక్సయిపోయారా ? అన్నదే అర్ధం కావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: