హైదరాబాద్ : ఎంపీ విషయంలో దిక్కులుచూస్తున్న ఎల్లోమీడియా

Vijaya



ఒకవ్యక్తిమీద దాడిచేసిన కేసులో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు సాక్ష్యాలతో సహా ఇరుక్కుపోయారు. అసలే అనేక కేసులతో సతమతమవుతున్న ఎంపీ తాజా ఘటనలో వీడియో సాక్ష్యాలతో దొరికేశారు. పైగా తాము దాడిచేసింది ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని నిర్ధారణ అవ్వటంతో ఎంపీ పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయారు. తమింటి ముందు పోలీసులు రెక్కీ నిర్వహించారని, తమ సిబ్బంది పట్టుకుందామనుకుంటే ఒక వ్యక్తి దొరకగా మిగిలిన వాళ్ళు తప్పించుకున్నారని ఎంపీ చెప్పింది అబద్ధమని తేలిపోయింది.





ఎంపీ ఇంటికి సమీపంలోనే ఐఎస్బీ దగ్గర డ్యూటీచేస్తున్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ ను అదేపనిగా పట్టుకుని కారులో వేసుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి బాగా కుమ్మేశారని సాక్ష్యాలు బయటపడ్డాయి. దాంతో  ఏమిచేయాలో అర్ధంకాని ఎంపీ తన చర్యలను సమర్ధించుకునేందుకు ఎదురుదాడికి దిగారు. అయితే ఎంపీ వాదనకు ఎల్లోమీడియా మాత్రమే మద్దతుగా నిలబడింది. అయితే ఎంపీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు బయటపడటంతో ఏమిచేయాలో తెలీక ఎల్లోమీడియా దిక్కులు చూస్తోంది.





సదరు కానిస్టేబుల్ పై రోడ్డు పక్కన ఎంపీ సిబ్బంది దురుసుగా వ్యవహరించటం, కారులోకి బలవంతంగా ఎక్కించటం వీడియోల్లో కనబడుతోంది. రోడ్డుపైనే ఇంత దురుసుగా వ్యవహరించిన సిబ్బంది ఇక ఇంట్లోకి తీసుకెళ్ళి మర్యాదలు చేస్తారా ? ఇంట్లో జరిగిన దాడుల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దాంతో ఎంపీ చెప్పిందంతా అబద్ధాలే అని తేలిపోయింది. ఇందుకనే ఇద్దరు సీఆర్పఎఫ్ సిబ్బంది సస్పెండ్ కూడా అయ్యారు.





అందుకనే ఎంపీతో పాటు ఆయన కొడుకు భరత్, పీఏ శాస్త్రి, భద్రతా సిబ్బంది మీద కూడా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఫిర్యాదుచేయటం, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదుచేయటం అంతా అయిపోయింది. ఇపుడున్న కేసులకు అదనంగా తాజాగా సాక్ష్యాలతో సహా దొరికిన ఎంపీ ఎలాగూ కోర్టుకెక్కుతారనటంలో సందేహంలేదు. మరి కోర్టు ఏమిచెబుతుంది ? కోర్టులో ఇంటెలిజెన్స్ అందించే వీడియో సాక్ష్యాలు ఎంతవరకు నిలబడతాయి ? అన్నది ఆసక్తిగా మారింది. కేసు పెట్టిన పోలీసులు ఎంపీకి ఇంకా నోటీసులిచ్చినట్లు లేదు. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: