మార్కెట్లోకి మేక.. ధర రూ. 70 లక్షలు.. ప్రత్యేకతలివే?

praveen
ఇటీవలి కాలంలో మటన్ ధర అంతకంతకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ధరలు ఎంతలో పెరిగి పోయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మటన్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇలా మటన్ ధర పెరిగిపోవడానికి కారణం మార్కెట్లో మేకల ధరలు పెరగడమే. అయితే ఇలాంటి సమయంలోనే ఇటీవలే మార్కెట్లోకి ఒక మేకను అమ్మడానికి తీసుకువచ్చాడు ఒక వ్యక్తి. సాధారణంగా మేకను  దాని బరువును బట్టి రేటును నిర్ణయిస్తా ఉంటారు. ఇక ఎంత ఎక్కువైనా  ఒక మేక ధర 20 వేల లోపే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అంతేకాదు ఒక మేకను కొనుగోలు చేయడానికి ఇక అంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టడానికి ఎవరూ కూడా అంతగా ఆసక్తి కనబరచరు. అయితే ఇటీవల ఒక వ్యక్తి మార్కెట్లో మేకను అమ్మేందుకు  తీసుకు వచ్చాడు. ఇంతకీ ఈ మేక ధర కలలో కూడా ఊహించనంత అతను చెప్పాడు.  ఎంతో తెలుసా ఏకంగా 70 లక్షల రూపాయలు. ఇక ఒక్క మేకకు ఇలా 70 లక్షల రూపాయల ధర చెప్పడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు అని చెప్పాలి. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ లో వెలుగులోకి వచ్చింది.


 బైజ్నాథ్ పర మార్కెట్ కు వచ్చిన ఒక మేక అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్యప్రదేశ్ అను పూర్ కు చెందిన వాహిద్ హుస్సేన్ అనే వ్యక్తి  మార్కెట్లో తన దగ్గర ఉన్న మేకను విక్రయించేందుకు తీసుకువచ్చాడు. 70 లక్షల రూపాయల ధర నిర్ణయించారు. అయితే మేక ఇంత ఎక్కువగా ధర ఉండడానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఆ మేక స్వదేశీ జాతికి చెందినది. ప్రకృతి ప్రసాదం. ఈ మేక శరీరంపై ఉర్దూలో అల్లా, మహమ్మద్ అని రాసి ఉంది. అందుకే ఇది చాలా ప్రత్యేకమైనది కాబట్టి దీన్ని ఇంత భారీ ధరకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఇక ఈ మేక  చిత్రాన్ని తీసి సోషల్ మీడియాలో నాగపూర్కు చెందిన ఒక వ్యక్తి పోస్ట్ చేయడంతో వైరల్గా  మారిపోయింది. 22 లక్షలు పెట్టి మేకను కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు సదరు వ్యక్తి. అతను మాత్రం 22 లక్షల కు మేకను అమ్మేందుకు  ఒప్పుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: