దేశంలో నెంబర్ వన్ సీఎం ఈయనే ? కేసీఆర్ జగన్ లు ఏ స్థానంలో ఉన్నారు ?
అయితే నేటి పరిస్థితులను బేరీజు వేసుకుని ఒక ప్రైవేట్ పొలిటికల్ సర్వే రాష్ట్రంలో పర్యటించి కేసీఆర్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేసింది. ఈ సర్వే ప్రకారం కేసీఆర్ కు గతంలో ఉన్న పేరు అంతా కూడా పాడయింది అన్న భావన కలుగుతోంది. కేసీఆర్ గురించి ప్రజల్లో అంత మంచి పేరు లేదన్నది సర్వే చెబుతున్న మాట. ఏ నమ్మకంతో అయితే ప్రజలు కేసీఆర్ ను రెండు సార్లు గద్దెను ఎక్కించారో... ఆ నమ్మకం పూర్తిగా కోలుకోకపోయినా సగానికి పైగా ప్రజల్లో నమ్మకం పోయిందట.
అయితే కొంతలో కొంత చెప్పుకోవాలి అంటే.. కేసీఆర్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కన్నా కాస్త బెటర్ గా ఉన్నాడని సదరు సర్వే చెప్పింది. ఇక ఎప్పటిలాగే మొదటి స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాధ్ కొనసాగుతున్నారు. మూడు, నాలుగు మరియు అయిదవ స్థానాలలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, అస్సాం సీఎం హిమంతా బిశ్వ ... పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఉన్నారు.