ఇకపై ఆఫీస్ ఇలా హాయిగా నిదరపొండి..

Deekshitha Reddy
ప్రభుత్వ ఆఫీసుల్లో మధ్యాహ్నం వేళ కాస్త కునుకుతీయడానికి అవకాశం ఉంటుందేమో కానీ, ప్రైవేట్ సెక్టార్ లో అలాంటివి అస్సలు కుదరదని అంటుంటారు. అయితే జపాన్ లో మాత్రం నిద్రపోవడానికి కూడా కాస్త సమయాన్ని కేటాయిస్తుంటారు యజమానులు. ఉద్యోగాలు కాస్త కునుకు తీసి తిరిగి యాక్టివ్ అవుతారని, ఆ తర్వాత బాగా పనిచేస్తారని వారి ఆలోచన. అయితే ఇలా పడుకునేందుకు వారికి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఇలాంటి వాటిల్లో న్యాప్ బాక్స్ అనేది సరికొత్త ఆవిష్కరణ.

జపాన్‌ లోని టోక్యోకి చెందిన కొయొజు ప్లైవుట్ కార్పొరేషన్ సంస్థ ఆఫీసుల్లో ఉద్యోగులు నిద్రపోయేందుకు సరికొత్త న్యాప్ బ్యాక్స్ లను అందుబాటులోకి తెచ్చింది. కాసేపు పడుకుని నిద్రపోవడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. పడుకొని నిద్రపోవడం అంటే.. ఇక్కడ నిలబడి నిద్రపోవడం అనమాట. అవును ఈ న్యాప్ బాక్స్ లలో నిలబడి నిద్రపోవచ్చు. దానికి అనుగుణంగా లోపల సౌకర్యాలుంటాయి. నిద్రపోయేవారికి బయటి శబ్దాలు వినపడకుండా ఇందులో ఏర్పాటు ఉంటుంది. అదే సమయంలో నిద్రపోయేవారి గురక ఇతరులకు ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాటు ఉంది. ఇలాంటి న్యాప్ బాక్స్ లు ఇప్పుడు జపాన్ లో హాట్ టాపిక్ గా మారాయి.

సాధారణంగా జపాన్‌ లోని ఆఫీసుల్లో మధ్యాహ్నం నిద్రకు అనుమతి ఉంది. దీనికోసం 20 నిముషాల టైమ్ కేటాయిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఇలా నిద్రపోడానికి అవకాశమిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతే ఊబకాయం వస్తుందనే మాట ఎలా ఉన్నా.. జపాన్ వాసులు మాద్రం మధ్యాహ్నం తిండి తర్వాత కాసేపు కునుకు తీయడానికి అలవాటు పడ్డారు. అది ఇల్లయినా, ఆఫీసయినా ఒకటే. అందుకే అక్కడి యాజమాన్యాలు కూడా ఉద్యోగుల ఇష్ట ప్రకారమే మధ్యాహ్నం నిద్రకు అనుమతిస్తున్నాయి. దీంట్లో భాగంగా ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేస్తుంటాయి. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా న్యాప్ బాక్స్ లు వచ్చాయి. వీటిని ఓ మూల నిబటెట్టేయొచ్చు. పెద్దగా ప్లేస్ ఆక్రమించవు. దీంతో ఇప్పుడు ఆఫీసులన్నీ న్యాప్ బాక్స్ లను ఆర్డర్ చేస్తున్నాయి. అయితే నిలబడి నిద్రపోవడం ఎంతమందికి సుఖంగా ఉంటుందో తెలియదు. అలా నిలబడి నిద్రపోయే అలావాటు చేసుకుంటే, ఇంట్లో కూడా న్యాప్ బాక్స్ లు కావాలని అడుగుతారేమో ఉద్యోగులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: