అమరావతి : తన అసమర్ధతను చంద్రబాబు బయటపెట్టుకున్నారా ?

Vijaya






అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంపుమండలాల్లో పర్యటించిన చంద్రబాబునాయుడు ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలుచేశారు. తాజా వ్యాఖ్యలవల్ల తనఅసమర్ధతను తానే అంగీకరించినట్లయ్యింది.  చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పరిశీలిద్దాం. మొదటిదేమో పోలవరం ప్రాజెక్టును నిర్మించలేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుండి తప్పుకోవాలన్నారు. తనకు అధికారం అప్పగిస్తే పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తికాదో చూస్తానని చాలెంజ్ చేశారు.



మూడేళ్ళల్లో రు. 8 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం నిర్వాసితులకు రు. 20 వేల కోట్లు ఖర్చు చేయలేకపోయారా అంటు నిలదీశారు. ఇక్కడే చంద్రబాబు వ్యాఖ్యలు, చాలెంజ్ పై జనాలకు ముందు వివరణ ఇవ్వాల్సుంటుంది. అదేమిటంటే తాను ఐదేళ్ళు అధికారంలో ఉండికూడా ఎందుకు నిర్మించలేదో సమాధానం చెప్పగలరా ? ఎన్డీయేలో నాలుగేళ్ళు భాగస్తుడిగా ఉండి కూడా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను తెప్పించలేకపోయిన తన అసమర్ధతను బయటపెట్టుకున్నారు.



ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం లాంటివి గాలికొదిలేసి ముందు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎందుకు చేశారో జనాలకు సమాధానాలు చెప్పగలరా ? ఎన్డీయేలో నాలుగేళ్ళు భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ రాష్ట్రప్రయోజనాల గురించి పట్టించుకోలేదన్న విషయాన్ని చంద్రబాబు పరోక్షంగా అంగీకరించినట్లయ్యింది. ఐదేళ్ళల్లో రాష్ట్రాభివృద్ధి యథాశక్తిగా బండలువేసిన చంద్రబాబు మరోసారి అధికారం అప్పగిస్తే పోలవరం కట్టేస్తానని, అమరావతి నిర్మాణాన్ని చేసేస్తానని, రైల్వేజోన్ సాధిస్తానని సొల్లుకబుర్లు చెబుతున్నారు.




ఎంతసేపు జగన్ రాజీనామా చేయాలి, అర్జంటుగా తాను ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఆరాటం తప్ప చంద్రబాబుకు మరో ఆలోచనే లేదు. క్షేత్రస్ధాయిలో పార్టీకి ఉన్న బలం ఏమిటో చూసుకోవటంలేదు. ఇండియు టు డే తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీకి 19 లోక్ సభ సీట్లు వస్తాయన్న విషయం తెలిసిందే. ఈ సర్వే విషయంలో చంద్రబాబు అండ్ కో కుళ్ళికుళ్ళి ఏడుస్తున్నారట. గ్రౌండ్ రియాలిటీని గమనించుకోకుండా కేవలం ఎల్లోమీడియా దన్నుతోనే పార్టీని నెట్టుకుస్తున్నారు. ఇంతోటిదానికి జగన్ రాజీనామా చేస్తే పోలవరం  కట్టేస్తానని ప్రగల్బాలు పలుకుతున్నారు. మొత్తానికి తన చేతకానితనాన్ని తానే బయటపెట్టుకున్నట్లయ్యింది.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: