ఢిల్లీ : ‘ఉచితాల’పై సుప్రింకోర్టు చేతులెత్తేసిందా ?
మొత్తానికి ఇంతకాలం తర్వాత ఎన్నికల్లో గెలవటానికి రాజకీయపార్టీలు ఇస్తున్న ‘ఉచిత’ హామీలపై సుప్రింకోర్టు చేతులెత్తేసినట్లే అనిపిస్తోంది. ఒకపార్టీ ఉచితం అన్నదాన్ని మరోపార్టీ సంక్షేమపథకమంటున్నది. దాంతో రెండుపార్టీల్లో ఏది చెప్పేది కరెక్టో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇదే విషయాన్ని విచారణ సందర్భంగా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా అంగీకరించారు. ఒకరికి ఉచితమైంది మరొకరికి సంక్షేమంగా కనిపిస్తోంది కదా అని ఎన్వీ రమణ పిటీషనర్ అశ్వినీ ఉపాధ్యాయను ప్రశ్నించారు.
రాజకీయపార్టీలు ఇచ్చే ఉచిత హామీలు కిందకు ఏవి వస్తాయి ? ఏవిరావు ? అనేది తేల్చటం కష్టంగా ఉందని సుప్రింకోర్టు అంగీకరించింది. నిజానికి ఉచితహామీలు ఇవ్వటం, వాటిని అమలుచేయటం అన్నది రాజకీయపార్టీల విచక్షణకు వదిలేయాలని మొదటినుండి చెబుతున్నదే. ఎందుకంటే ఎన్నికల్లో గెలవటమే టార్గెట్ అయిపోయిన తర్వాత ఒక్కోపార్టీ ఒక్కోవిధమైన హామీలను ఇస్తుంది.
ఇందులో ఏపార్టీ ఇచ్చే హామీ తప్పు, ఏ పార్టీ హామీ ఒప్పని తేల్చాల్సింది జనాలే కానీ కోర్టులో లేకపోతే కేంద్ర ఎన్నికల కమీషనో కాదు. రాజకీయపార్టీలు ఉచితహామీలివ్వకుండా కోర్టు అడ్డుకోలేందని సుప్రింకోర్టు తేల్చేసింది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, మంచినీటి సరఫరాను ఉచితపథకాలుగా చూడలేమని కోర్టు అభిప్రాయపడింది. సో ఏ కోణంలో చూసినా ఉచిత హామీలివ్వకుండా రాజకీయపార్టీలను నియంత్రించలేమని సుప్రింకోర్టుకు అర్ధమైపోయింది. జనాలు కూడా అమయాకులు కారన్న విషయం సుప్రింకోర్టు అర్ధంచేసుకున్నది.
అందుకనే ఉచితహామీలిస్తున్న ప్రతిపార్టీని జనాలు అధరించటంలేదు కదా అని నిలదీసింది. ఉచితహామీలిస్తున్న పార్టీలన్నింటికీ జనాలు ఓట్లేయటంలేదన్న విషయాన్ని గుర్తుచేసింది. నిజానికి రాజకీయపార్టీలిస్తున్న హామీల అమలును గుర్తించటంలో ఓటర్లకు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పార్టీలిస్తున్న హామీల్లో ఆచరణ సాధ్యమయ్యేవి ఏవి ? ఆచరణ సాధ్యంకానివి ఏవనే విషయాన్ని ఓటర్లు జాగ్రత్తగా గమనిస్తుంటారు. 2014లో చంద్రబాబునాయుడు అనేక హామలిచ్చారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో కూడా హామీలిచ్చినా జనాలు ఘోరంగా ఓడించారు. ఎందుకంటే 2014 హామీల అమలులో చంద్రబాబు ఫెయిలయ్యారని జనాలకు అర్ధమైపోయింది. రేపటి ఎన్నికల్లో జనాలు ఎవరికి ఓట్లేస్తారో చూడాలి.