అమరావతి : చంద్రబాబుది సేఫ్ గేమా ? లేకపోతే డబల్ గేమా ?

Vijaya





ఇపుడీ విషయమే జనసేనలో చాలామంది అర్ధం కావటంలేదు. తెలుగుదేశంపార్టీ-జనసేన మధ్య పొత్తుంటుందని కొందరు, లేదు లేదు రెండుపార్టీలు దేనికదే పోటీచేయటం ఖాయమని మరికొందరు నేతలు చెబుతున్నారు. మొత్తానికి పొత్తుల విషయంలో రెండుపార్టీల్లోని చాలామంది నేతల్లో అయోమయమైతే కంటిన్యు అవుతోంది. ఈ అయోమయానికి కారణం ఏమిటంటే చంద్రబాబునాయుడు వైఖరనే చెప్పాలి. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటిస్తు మరికొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను ప్రకటిస్తున్నారు.






జనసేనతో పొత్తుంటే అభ్యర్ధులను అయినా ఇన్చార్జిలను అయినా ప్రకటించే అవకాశాలు లేవు. ఎందుకంటే పొత్తుల్లో ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీచేస్తుంది ? చేసే సీట్లు ఏవనే విషయాలు తేలాలి. అప్పుడే తమకు దక్కిన నియోజకవర్గాల్లో పార్టీల అధినేతలు అభ్యర్ధులను ప్రకటించగలరు. కానీ ఇక్కడ చంద్రబాబు అభ్యర్ధులతో పాటు ఇన్చార్జిలను కూడా ప్రకటించేస్తున్నారు. దాంతోనే తమ పార్టీతో టీడీపీకి పొత్తుంటుందా లేదా అనే విషయంలో ముఖ్యంగా జనసేనలోనే అయోమయం పెరిగిపోతోంది.





చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, డోన్, పీలేరు లాంటి కొన్ని నియోజకవర్గాలకు చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే చాలా నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను కూడా ప్రకటించారు. ఇన్చార్జిలను ప్రకటించిన నియోజకవర్గాలు ఉభయగోదావరి జిల్లాలు, రాయలసీమలోనే ఎక్కువగా ఉన్నాయి. జనసేన కూడా వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ మీదే ఎక్కువగా దృష్టిపెట్టిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. బలిజ లేదా కాపు సామాజికవర్గాల ప్రభావం ఎక్కువగా ఎక్కడుంటే అక్కడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువ దృష్టిపెడుతున్నారు.






చంద్రబాబు వైఖరిపై మాట్లాడేందుకు కొందరు నేతలు ప్రయత్నించినా పవన్ అవకాశమివ్వలేదు. పొత్తులగురించి నేతలు ఎక్కడా మాట్లాడద్దని, సమయం, సందర్భం చూసుకుని తానే మాట్లాడుతానని చెప్పటంతో జనసేన నేతల్లో అయోమయం కంటిన్యు అవుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని ఖర్చులు పెట్టుకున్న తర్వాత చివరలో ఆ సీటు పొత్తుల్లో టీడీపీకి వదిలేసుకున్నామని పవన్ అంటే ఏమి చేయాలి ? అనే సందేహం పెరిగిపోతోంది. మరి జనసేన విషయంలో చంద్రబాబుది సేఫ్ గేమా లేకపోతే డబల్ గేమా అర్ధం కావటంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: