హైదరాబాద్ : చంద్రబాబు, పవన్ ఇద్దరికీ బీజేపీ షాక్

Vijaya






ఒకరేమో బీజేపీకి మిత్రపక్షం అధినేత. మరొకరేమో బీజేపీతో పొత్తుకోసం తహతహలాడిపోతున్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఇపుడు బీజేపీ ఇద్దరికీ ఒకేసారి షాకిచ్చింది. ఎలాగంటే ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న  ఒక హోటల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీయార్ తో భేటీ అవ్వటం ద్వారా. అవునే అమిత్-జూనియర్ భేటీ జరిగింది. వీళ్ళభేటీ విషయం అమిత్ ఆదివారం హైదరాబాద్ కు వచ్చేంతవరకు కూడా బయటపడలేదు.



మునుగోడు బహిరంగసభలో పాల్గొనేందుకు షా హైదరాబాద్ వచ్చారు. తిరిగి మునుగోడు నుండి వచ్చిన తర్వాత జూనియర్ తో భేటీఅయ్యారు. అమిత్ షానే ఏరికోరి జూనియర్ తో మాట్లాడి సమావేశమయ్యేందుకు ఒప్పించారని టాక్ నడుస్తోంది. చాలాకాలంగా పెద్ద సెలబ్రిటీని పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ ఎప్పటినుండో ప్రయత్నిస్తోంది. చిరంజీవితో మాట్లాడితే మెగాస్టార్ ఒప్పుకోలేదు. దాంతో తన దృష్టిలో జూనియర్ పైకి మళ్ళించిందని సమాచారం.



నిజానికి మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కూడా పెద్ద స్టారే. అయినా సరే జూనియర్  గురించి ఆలోచిస్తున్నారంటే అర్ధమేంటి ? ఇంతేకాకుండా ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం మునుగోడు సభనుండి తిరిగివచ్చేటప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో అమిత్-రామోజీ భేటీ జరిగింది. ఈ భేటీలో చంద్రబాబు కూడా ఉంటారని ప్రచారం జరిగినా క్లారిటిలేదు. చంద్రబాబుకి జూనియర్ కు ఏమాత్రం పడదన్న విషయం బీజేపీకి బాగా తెలుసు. తెలిసికూడా చంద్రబాబుకు వ్యతిరేకమైన జేనియర్ తో అమిత్ భేటీ అయ్యారంటే అర్ధమేంటి ?




రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ ఊరికే కలవరు. అమిత్-జూనియర్ భేటీలో ఏం జరిగిందనే విషయం వెంటనే తెలియకపోవచ్చు. కానీ కచ్చితంగా రాబోయే ఎన్నికలగురించే మాట్లాడుకునుంటారనటంలో సందేహంలేదు. తెలంగాణాలోని కమ్మోరి ఓట్లకోసమే బీజేపీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నదనే ప్రచారం తెలిసిందే. అయితే జూనియర్ తో కూడా కమ్మోరి ఓట్లకోసమే అమిత్ భేటీ జరిగితే చంద్రబాబుతో పొత్తు అవసరంలేదని అనుకుంటున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే నిజమైతే పవన్+చంద్రబాబు ఇద్దరికీ బీజేపీ పెద్ద షాకిచ్చినట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: